పుట:Aandhrapatrika sanvatsaraadi sanchika 1910.pdf/261

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వంగల నారాయణ బి.ఎ.గారు. పట్టపరీక్షలో గడితేరిన వీరు జపానువెళ్ళి నేతపరిశ్రమమున బ్రవీణులై వచ్చినవారు. పరిశ్రామిక వృత్తులను గురించి వీరీ సంచికలో వ్రాసియున్నారు.


గోటేటి జానకి రామయ్యగారు:- వీరు జపానుదేశమునకు వెళ్ళి కాగితముల పరిశ్రమలో గడితేరి వచ్చిరి.


ప్రొఫెసర్ కోడి రామమూర్తి నాయుడుగారు.

విజయనగర వాస్తవ్యులగు వీరు అభినవభీమసేనుడని ప్రఖ్యాతిగాంచిన మల్లుడు. మింటో ప్రభువు, మింటో ప్రభ్విణి మొదలగు గొప్పగొప్పవారి మెప్పులను బడసినవారు. వీరసమాన బలసంపన్నులు. ఇనుపగులుసులనవలీల ద్రెంతురు. మఱియునీయవ బలచర్యలనేకములు గలవు.