పుట:Aandhrapatrika sanvatsaraadi sanchika 1910.pdf/219

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202 ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక.

                  గాంతలు మరువంపు ♦ గాను కిచ్చినఁ దుల
                             సీదళం బనుచుఁ భ ♦ క్షింపఁ జూచుఁ
                  బొలఁతులు తెలిగంద ♦ వొడి యిచ్చిన విభూతి
                             యిది యటంచుఁ ద్రిపుండ్ర ♦ మిడఁ దలఁచు

                   నలరుఁబోడులు వజ్రాల ♦ హార మొసఁగఁ
                   బటిక పుజపాక్షసర మంచుఁ ♦ బాణిఁ బూని
                   మౌని జపియించఁ దివురు నెం ♦ దైనఁ గలరు
                   ముగ్ధ లగువార లిటువంటి ముగ్ధ గలఁడె.
                                 _________

(8) కదిరీపతి. (1620 క్రీ.శ.)

ఇక్కవిరా జనంతపురము జిల్లాలో నుండుకదిరి యనుపురమునకుఁ బ్రభువు;చతుర్థకులజుఁడు. ఇతని తండ్రి రామదేవరాయలయొద్ద సేనాపతిగా నుండెను. ఇక్కవిశుకసప్తతి యను ఱంకుటాండ్రయుబొంకుటాండ్రయుకథలు గల కావ్యము నొక్కటిరచించి స్వభావోక్తివర్ణనము లనువలలు పన్ని జాతీయ వచోరత్నము లనుగాలముల నిచ్చి దుర్ణీతివిముఖము లగు పండిత చిత్తముల సైతము బలాత్కారముగ నాకర్షించు నంతకవితాచాతుర్యము చూపియున్నాఁడు. ఇతఁడు జగచ్చక్షువు; సర్వేంద్రియవ్యాపారుఁడు.

                 "ఇఁక నొకసారి పల్కిన ఘటిల్లని చిందునొ నోటిముత్యముల్."

అతి సరస ప్రయోగములును జాతీయములును దేశీయములును దీనిలోఁ బెక్కులు గలవు. దీనిని రచించినకవి యద్వంద్వుఁడో లేక మన్మధుని జంత్రమో తెలియరాదు. దీనిని సరస్వతీపత్రికాధిపతు లిప్పుడ ముద్రించిరి కావున నుదాహరణము లనావశ్యకము.

(9) మల్లారెడ్డి. (1600 క్రీ.శ.)

ఇతఁడు భాగ్యనగర మనునన్వర్థనామము గలహైదరాబాదునకు 40 ది మైళ్ళుత్తరముగా నుండు బిక్కనవోలుపురమున కధీశ్వరుండు. ఇతనియన్న యగుకామినేని కామారెడ్డి డిల్లీ పట్టణమున నకబ్బరుచే సమ్మానింపఁబడినవాఁడు. అతని పేరిటనే సోమనాథకవి బ్రహ్మొత్తర ఖండమును సూతసంహితయును రచించెను. మల్లారెడ్డి సమీపముననుండు గోదావరీ తీరమున వేములవాడ యనుక్షేత్రమున రాజేశ్వరస్వామికిఁ బరమభక్తుఁడై శివదీక్షాపరుఁడై యుండెను. ఇప్పటికిని వీరిసంతతివారి శైవభక్తియు నిష్కాపట్యమునుజాలఁగొనియాడఁ దగినవి. ఇతఁడు షట్చక్రవర్తిచరిత్రయు, శివధర్మోత్తరఖండమునురచించెను. మొదటిదిప్రబంధము. రెండవదిశైవశాస్త్రాగమము. పై యదివర్ణ నాప్రధానమైనది. క్రిందటిదిప్రమాణ పూర్వకమైనది. అచ్చటచ్చట దోషము లున్నను గవిత్వ మించుక ప్రౌఢముగానే యుండును. శివధర్మోత్తరఖండ మెనిమిదాశ్వాసములు గలది. ఇతఁడు వ్యాకరణ వేదాంతశైవాగమాదుల జితపరిశ్రముఁడని తోచుచున్నది.

(10) సాయపవేంకటపతి. (1620. A.D.)

అప్పకవి యితనిపేరు తనకృతిషష్ఠ్యంతములలోఁ బేర్కొనెను. ఇతఁడు పెమ్మసాని చినతిమ్మభూపతికి నల్లుఁడు. కడపజిల్లాలోఁ బినాకినీతీరమున నుండు గండికోటదుర్గమునకుఁ బ్రభువు. ఇతఁడు సకలజనసంజీవనిపేరఁ బ్రసిద్ధుఁడగు రామానుజాచార్య చరిత్రమును స్వయముగా రచించెను. ఇక్కవికి ద్రమిళభాషలో నిరర్గళపాండిత్యము కలిగియున్నట్లు తద్గ్రంథములోనికొన్నిప్రదేశములు తిరుప్పావు మొదలగు వైష్ణవప్రబంధములతోఁ బోల్చి చూచినయెడల మనకుఁ దోఁచును. ముకుందమాల మొదలగుసోత్రములనితఁడక్కడక్కడఁదెనిఁగించి కావ్యమునఁజొప్పించుచున్నాఁడు. ఇది యైదాశ్వాసముల గ్రంథమైనను జాలఁ బెద్దది. కవిత యంతమనోహరమైనదికాదు. శృంగారరసమే ప్రధానముగాఁ గలయాంధ్రకవితలఁ జర్చించిన నాకు విష్ణుభక్తిప్రధాన మగుదీన స్వారస్యము గ్రహింప బుద్ధిమాంద్యము కలిగెనేమో? అనేకద్రవిడప్రబంధములు తెనిఁగింపఁబడి యుండుట యెవ్వరి కింకను దెలియరాదు. నమ్మాళ్వారులు రఆంధ్రపత్రిక : _ చందాఅతిస్వల్పము. సంవత్సరముకు 2-2-0 లుమాత్రమే. సకలదేశవార్తలనుగలిగి యుండును.