ఈ పుట ఆమోదించబడ్డది

507

శ్రీనాథుఁడు

యందు ముంుదగా స్వార్ధమును తీర్ణముగలిసివచ్చునట్లుగా శ్రిశైలయాత్రకు వెడలెను. దక్షిణ హిందూస్థానములో వైష్ణవులకు విష్ణస్థలమయిన చిత్తూరు మండలములోని తిరుమల యెట్లు ముఖ్య స్థలమో యట్లే శై_వులకు శివస్థల మయిన కర్నూలు మండలములోని శ్రీశై_లము ముఖ్యస్థలము. ఒకటి సంస్కృతముగాను, రెండవది యఱవముగాను నున్నను శ్రీశైలము తిరు మల యను రెండు పదములకు నర్థ మొక్కటియే. రెంటికిని పవిత్రమైన పర్వతమని యర్ధము శ్రీశై_లస్థలాధిదేవతలు మల్లికార్జునుఁడును భ్రమరాంబయు నయి యున్నారు.అట్టి పుణ్యస్థలమయిన శ్రీశైలదివ్యక్షేత్రమునకు కొండవీటిరెడ్డిరాజ్యనాశనానంతరమున శ్రీనాధుఁడు యాత్రకుఁ బోయి దేవతా దర్శనముఁ జేయుటయేకాక యచ్చట మరాధికారు లయి యుపడిన జంగమ గురుపీఠమువారి దర్శనము చేసి వారి యనుగ్రహమసకుఁ బాత్రుఁడయి తాను రచించిన శివరాత్రి మాహాత్మ్యమును ముమ్మయపుత్రుడై_న శాంతయ్య కంకితమొనర్చెను. ఈ శివరాత్రిమాహాత్మ్యమును ఆంధ్రసాహిత్య బరిషత్తు వారు సంపాదించి తమ గ్రంథాలయమునందుంచియున్నారు. వారియొద్ద నున్న తాళపత్రపుస్తకము పురాతనమయి కొంతవఱకు భాణనామకక్రిములకాహారమయి మిక్కిలి శిథిలమయి యున్నది. ఆ పుస్తకములోని మొదటి పద్యములోని మొదటి పాదమే మొదలు చెడి యిట్లున్నది.

శా. ..................................వాశ్రితోర స్థ్సలీ
    నాగాధీశవిశిష్టసంస్తవలసన్నాళీకపాదద్వయ
    ప్రాగాల్భ్యుం డగు శంకరుండు మనుచుం బ్రత్యక్షమై యెప్పడున్
    యోగీంద్రాఖ్యుని ముమ్మడీంద్రసుతు నయ్యుద్యుక్తశాంతాత్మునిన్.

శివరాత్రిమాహాత్మ్యములోని రెండవ పద్య మిది

శా. శ్రీరామారమణుం డశేషజగతీ క్షేమంకర ప్రక్రియా
    భారాయత్తమనస్కుఁ డార్యజనసంభావ్యుండు భవ్యాత్ముఁడై
    గారా మారఁగ నొమ్మమాంబికసుతున్ గౌరీశభక్తాగ్రణిన్
    ధీరున్ మమ్మయశాంతునిన్ మనుచు సందీర్ఘాయురర్జాడ్యుఁగన్