ఈ పుట ఆమోదించబడ్డది

468

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

2.అల్లాడ రెడ్డి

కాటయవేమారెడ్డి మరణము నొందఁగానే యిదే సమయమని రాజమహేంద్రవరరాజ్యము నాక్రమించుకొనుటకయి కోమటివేముఁడు మరలసైన్య సన్నాహము చేసికొని దండు వెడలెను. అల్లాడ రెడ్డి తన సేనలతో నాతనిని మార్గమధ్యముననే యెదురుకొని రామేశ్వరమువద్ద ఘోర సంగ్రామము సలిపి యతని నోడించి సైన్యమును హతముచేసి కోమటివేమారెడ్డిని వెనుకకు దఱిమివేసెను. ఈ విషయపుయి కోరుమిల్లి శాసన మిట్లు చెప్పుచున్నది -

     శ్లో. జిత్వానల్పవికల్పకల్పితబలం తం చాల్పభాసుం రణే
         మిత్రీకృత్య సమాగతంగజపతిం కర్ణాటభూపం చ తమ్
         హత్వా కోమటివేమసైన్యనికరం భూయో౽పి రామేశ్వరాత్
         రాజ్యం రాజమహేంద్ర రాజ్య మకరో దల్లాడభూమీశ్వరః.

ఆల్లాడ రెడ్డి యిట్లు కోమటివేముని నపజయము నొందించి తఱిమి వేసి, రాజద్రోహులయిన యితరుల నడఁచివేసి, రాజమహేంద్రవరరాజ్యమును బాలుఁ డైన కుమారగిరికి మాఱుగాఁ గాఁబోలును 1416- వ సంవత్సరము నుండి తానే యేలసాగెను. అల్లాడభూపతి యనవేముని పుత్రికాపుత్రిక యైన వేమాంబను వివాహముచేసికొనియె ననియు, ఆమె తండి భీమరా జనియు, పయిని జెప్పిన యంశమును కోరుమిల్లి శాసనములోని యీ శ్లోకము
స్థాపించుచున్నది

      శ్లో. శచీవ శక్రస్య శివేవ శంభోః
          పద్మేవ సా పద్మవిలోచనస్య,
          వేమాంబికా చోళకులేందుభీమ
          భూపాత్మజాభూ న్మహిళాస్య జాయా.

అల్లాడభూపతికి వేమాంబవలన వేమారెడ్డి, వీరభద్రారెడ్డి, దొడ్డారెడ్డి, అన్నారెడ్డి, అని నలుగురు కొడుకులు గలిగిరి అనితల్లి తమ్ముఁడును కాటయవేమారెడ్డి కొడుకును నయిన కొమరగిరిరెడ్డి యుక్తవయస్సు రాక