ఈ పుట ఆమోదించబడ్డది

280

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

         జిదియించు బగిలించుఁ జేతులతీఁట వో
                పడిఁ గాండ మేసి మావతులతలలు

         తలపుడికి వ్రేసి మావంతుతలలు శత్రు
         రాజశిరములుఁ ద్రొక్కించు రాఁగెఁ దిరుగ
         వాగె నుబ్బెడు తన వారువంబుచేత
         మహీతశౌర్యుండు కొమ్మయామాత్యవరుఁడు.

     చ. అరిగజకుంభపాటనవిహారము కొమ్మనమంత్రి సల్పుచో
         నురలిన మౌక్తికవ్రజము లుర్విపయిం బొలిచెం దదీయసం
         గరహతవీరదోర్గ్రహణకౌతుక సంభ్ర మఖేచరీపార
         స్పరతనుమర్దనోద్గళితభాసురహారమణీచయం బనన్.

చోళరాజులు చాళుక్యచక్రవర్తులకు లోcబడిన సామంతమండలాధీశ్వరులయ్యును రాజ్యకాంక్షచేత నొండరులతోఁబోరాడిచంపుచc జచ్చుచు నుండిరి. ఈ వెలనాటిచోడుని పుత్రుఁడైన పృధ్వీశరాజును మనుమసిద్ధి తండ్రి యైనచోడతిక్కభూపాలుడు చంపెను, కృతిపతితాత యగు కేతన మంత్రి పృథ్వీశరాజునకు మంత్రిగా నుండెను. ఈ పృధ్వీశరాజునే మనుమసిద్దిరాజుయొక్క తండ్రియైన తిక్కనృపాలుఁడు చంపినట్లు నిర్వచనోత్తర రామాయణమునందీ పద్యమునఁ జెప్పఁబడినది.

    ఉ. "కేశవసన్నిభుండు పరిగీతయశోనిధి గూడ తిక్కధా
         త్రీశుఁడు కేవలుండె సృపు లెవ్వరి కాచరితంబు గల్గునే
         శై_శవలీలనాఁడు పటుశౌర్యధురంధరబాహుఁ డై న పృ
         థ్వీశనరేంద్రుమస్తకము నే డ్తెఱ గందుక కేళి సల్పఁడే."

తిక్కధాత్రీశ్వరుఁడు శైశవదశయందే పృధ్వీశనరేంద్రునిఁ జంపుటచే నిది పదమూడవ శతాబ్దారంభమునందు జరిగి, తిక్కనరాజు 1250 వ సంవత్సర ప్రాంతమువఱకును రాజ్యము చేసి యుండును. ఈ చరిత్రాంశముకూడ తిక్కనరేంద్రుని పుత్రుఁడై న మనుమసిద్ధికాలములో నుండిన తిక్కనసోమ