ఈ పుట ఆమోదించబడ్డది

204

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

       క. గోత్ర పవిత్రుఁడు సద్గుణ
          పాత్రుడు సివ్వనకు మిగులఁ బతిహిత శుభచా
          రిత్రారుంధతిగౌరమ
          ధాత్రీసతి యిద్దఱికిని దనయుఁడ జగతిన్.'

అనియు నున్నది. ఇందు మొదటి ప్రతిలోని పాఠమునుబట్టి రాజనరేంద్రునిచే నగ్రహారమును బడసినవాఁడు గణితశాస్త్రకర్త యైన పావులూరి మల్లనయే యని స్పష్టముగాఁ గానవచ్చుచున్నది. రెండవ ప్రతిలోని పాఠమునుబట్టి గణితశాస్త్రకర్త యైన మల్లన తాత యగ్రహారమును బడిసినట్టు కనబడుచున్నది ఈ రెండు పాఠమ లలో మొదటి పాఠమే సరియైనదని నా యభిప్రాయము. గణిత శాస్త్రవేత్తయు లాక్షణిక కవియు నైన మల్లనకే రాజరాజనరేంద్రు డగ్రహారము నిచ్చి యుండును గాని ప్రసిద్దుండు గాని మల్లన కూరక యిచ్చి యుండఁడు. ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారములో నున్న ప్రతులలోని పాఠము రెండవ ప్రతిలో నున్నట్లే యున్నది. ఎక్కువ ప్రతులలో ని ట్లుండుటచేత గణితమును రచియించినకవి యగ్రహారమును సంపాదించిన మల్లనమను మఁడే యనుకొన్నను, అగ్రహారమిచ్చినది 10౩౦ వ సంవత్సర ప్రాంతమయిన పక్షమున నటుతరువాత ముప్పది నలువది సంపత్సరముల కనఁగా కాక ఒక 1060-70 సంవత్సర ప్రాంతములయందు గణిత శాస్త్రకర్త యయిన పావులూరి మల్లన యుండి యుండును.[1]

  1. ['శివ్వనపుత్రుఁడు మల్లఁడున్నతిన్' అను పాఠమే సరియైనదనియు, రాజరాజు వలన నఖండవాడc బడసినది గణిత శాస్త్రకర్త గాక యాతని తాతయే యనియు, మనుమఁడగు మల్లన క్రీ.శ. 1100 ప్రాంతము వాడనియు విమర్శకుల యాశయము మఱియుఁ బద్యమున బేర్కొనఁ బడిన రాజరాజు, రాజనరేంద్రుఁడని చెప్పుటకుఁ దగిన యాధారములు లేవనియు, అఖండవాడ వెలనాఁటి చోడరాజగు పృథ్వీశ్వరుచే కుంతీమాధవస్వామి కర్పింపcబడినట్లు క్రీ.శ. 1186 లోని శాసనము వలన దెలియవచ్చుచున్నదనియు, విూది పద్యము సరిగా నుండలేదనియు, 'తెనుఁగు కవుల చరిత్ర'లోఁ దెలుపఁబడియున్నది.(పుట.282) మల్లన, నన్నయ కించుమించుగఁ నే బదియేండ్ల తర్వాతి వాcడని శ్రీ తిమ్మవజ్ఝల కోదండ రామయ్య గారనుచున్నారు. ఈ 'పావులూరి మల్లనకవి'యు దిక్కనకు ముందురా వలసినవాఁడు]