ఈ పుట ఆమోదించబడ్డది

136

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

నగు మనుమరాజు గా 1250-వ సcవత్సరప్రాంతములయందు రాజ్యము కోలుపోవుటలో వింత యేమియు లేదు. మనుమరాజు కాలములోనివాడయిన తిక్క-న 13 -వ శతాబ్దారంభముననుండి యుండి యుండవలెను. ఈ సందర్భమున శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారు తమ యాంధ్రులచరిత్రము ద్వితీయభాగమున నిట్లు వ్రాసియున్నారు.

"ఈపై పద్యములలో నితఁడు. . . . చోడునిసింహానముపై నుంచి చోడస్థాపనాచార్యబిరుదమును గై కొనియె ననియుఁ జెప్పఁబడి యున్నది. ఈ పద్యములలోఁ జెప్పఁబడిన విషయము లన్నియు సత్యము లనుటకు సందియము లేదు. మూcడవ కులోత్తుంగచోడ చక్రవ ర్తి వెనుక రాజ్యపదవిని వహించిన మూడవ రాజరాజచోడుఁడు సమర్ధుఁడు గాక మిక్కిలి బలహీనుఁ డగుటవలనను, గృహకలహములవలనను. మధ్యఁ గొంత కాలము రాజ్యమును పోఁగొట్టుకొనవలసినవాఁడయ్యెను. ఇతని కాలమున మారవర్మ సుందరపాండ్యమహారాజువలనను, కర్నాటక వీర సోమేశ్వరునివలనను, పల్లవుండై న కొప్పరింజింగదేవుఁ డను మహామండలేశ్వరునివలనను, రాజ్యమున కుపద్రవము సంభవించెను. మహామండలేశ్వరుఁడైన యీ తిక్కభూపాలుఁడు పాండ్యులను, కర్ణాటక వీర సోమేశ్వరుని జయించి, రాజరాజచోడుని సింహాసనమున నిలిపి చోళ స్థాపనాచార్యుc డను బిరుదమును వహించెను. గాంగవాండిదేశమును బరిపాలించుచుండిన హోసలరా జయిన వీరసోమేశ్వరుని శాసనములు క్రీ. శ. 1234 మొదలుకొని 1253 వఱకును గానంబడుచుండుటచేతను, అతనితోఁ దిక్కభూపతి సమకాలికుం డని చెప్పఁబడి యుండుటచేతను, తిక్కరాజకాలము మనకు స్పష్టముగాఁ దెలియుచున్నది. వీరసోమేశ్వరుఁడు గూడ చోళుని సింహాసనమునఁ గూర్చుండఁబెట్టె ననియు, అతcడును తిక్కభూపాలుఁడు నొండొరులతోఁ బోరాడుచుండి రనియును, దెలియుచుండుటచేత, నిరువురును చోళసింహాసనమునకై పోరాడువారిలోఁ జెఱి యొకప్రక్కను జేరి యుద్ధము చేసిరని యూహింపనగు."