పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/89

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాణాద పెద్దన సోమయాజి.

ఈకవి నిజామురాజ్యములోని గద్వాల సంస్థానాధిపతి యైన ముష్టిపల్లి సోమభూపాలుని ప్రేరణముచేత ముకుందవిలాసమును, ఆధ్యాత్మరామాయణమును రచియించెను. ఇతడు నందవరీక నియోగిబ్రాహ్మణుడు; ఆశ్వలాయనసూత్రుడు; ఆత్రేయ గోత్రుడు; తిమ్మనార్యపుత్రుడు.