కనుపర్తి అబ్బయామాత్యుడు.
ఈకవి యాఱువేల నియోగిబ్రాహ్మణుడు; రాయన మంత్రిపుత్రుడు; కౌండిన్య గోత్రుడు. ఈతనితల్లి నరసమాంబ; అన్న యోగానందము. ఈకవి యనిరుద్ధ చరిత్రము, కవిరాజమనోరంజనము, అను రెండు ప్రబంధములను రచియించెను.