పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/9

ఈ పుట ఆమోదించబడ్డది

Vi


రమునహర్ష సామ్రాజ్య ముచ్ఛస్థితికి వచ్చియుండెను.దక్షిణాపథమున పశ్చిమ చాళుక్య సామ్రాజ్యము సత్యాశ్ర య రెండవ పులకేశి వల్లభునిచే స్థాపింపబడి,ఉఅచిరకాలంలోనే యొక్క వెలుగు వెల్గి మెఱపువలె మామమ య్యెను. తూర్పున చాళుక్యాన్వయ మొకటి రాజ్యముస్థాపించుకొని ఆరు శతాబ్దములకాల మవిచ్ఛిన్నముగ నాంధ్రభూమిని యేలుటకు బునాదులు వేయుచుండెను.దక్షిణమున కాంచీపుర పల్లవులు విజృంభింప నారంభిం చుచుండిరి.ఎక్కడజూచినను అసహ్యకరములయిన మహాయాన సంప్రదాయాచారములుతో నిండిన బౌద్ధమతము జనులచే పరిత్యజింపబడుచుండెను. జైనమతమును అట్లే క్షీణించుచుండెను. కాని దీనికింకను కొంత రాజాశ్రయ ముండెను. అట్టికాలమున,బౌద్ధుడును,విమతద్వేషియునగు యుఁఆ౯చాంగ్‌ మన యాంధ్రదేశమును సందర్శిం చి, బౌద్ధక్షేత్రములందించుక కాలముగడుపుచు,దేశమునందు రెండేండ్లు సంచారము చేసి వెడలిపోయెను.

పదమూడవ శతాబ్దాంతమున మార్కొపోలో సందర్శింప నేతెంచినపుడును ఆంధ్రదేసమునందు, మత, సాంఘిక రాజకీయ విప్లములు జరుగుచుండెను.అయ్యది చాళుక్యచోళ సామ్రాజ్యమంతరించిన కాలము.అయ్యది వెలనాటి చోడరాజుల ప్రయభణగిపోయి, కాకతీయభూపాలురు విజృంభించిన సమయము.ఆంధ్ర యువతి, పురుషవేష ధారిణియై, వీరవనితయై, యాంధ్రభూమిని,నిరుపప