పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/87

ఈ పుట ఆమోదించబడ్డది

ధనకటకము, ధాన్యనాటీపురము, ధాన్యవతీపురము అను పేరులు అమరావతీ నగరమునకు సంబంధించిన పేర్లుగా క్రీ.శ. 10, 11, 12, 13 శతాబ్దముల కాలమునాటి విచ్చట లభించిన శిలాశాసనములందు గానవచ్చుచున్నవి. ఒకప్పుడీ పేరులన్నియు నీ కాలమున ధరణికోటయని బరగుచున్న నగరమునకే వర్తిలుచుండెను. భరతఖండమునందలి పురాతన పట్టణములలో పాటలీపుత్రము తరువాత విశేష ప్రఖ్యాతిగాంచిన దీధాన్యకటక నగరము. ఇది అయిదు శతాబ్దములకాల మాంధ్ర మహాసామ్రాజ్యమునకు రాజధానియై, మహోన్నత వైభవమును గాంచెను. ఆపూర్వపు వైభవము నేడు అమరావతి ధరణికోట మంటిదిబ్బలయందు, పాడయి శిధిలావశిష్టములయిన కట్టడములందును గానవచ్చుచు నచ్చెరువు గలిగించుచునే యున్నది.

ధాన్యకటక ప్రాంతమును యు ఆన్ చ్వాంగ్ వ్రాతను బట్టి, కన్నింగ్‌హాముదొర దొనకొట్టదేశమనియు, ధరణికోట ధారణికోటగాని ధరణికోటగాదనియు, భావవివేకస్వామి, వజ్రపాణి ధారణిని జంపించుటచే ధారణికోట యయ్యెననియు విపరీతముగ సిద్ధాంతముచేసినాడు[1]. ధనకటక నగరముండు దేశమగుటచే యు ఆన్ చ్వాంగ్ ధనకటక నగరనామము నా దేశమునకు ముడిపెట్టెను. కాని రాజధానిపేరు నిశ్చయింపలేదు. ఇదిగాక మరియొకచోట మనయాత్రికుడు ధనకటక

  1. Ancient Geography of India 530 ff. J.R.A.S. 1873. p 263.