పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/79

ఈ పుట ఆమోదించబడ్డది

అంతేగాక, మంత్రశాస్త్రమునందును, శాక్తేయమునందును, ఐంద్రజాలికవిద్యలందును, జనుల కెక్కువగా ప్రమాణబుద్ధి ప్రబలియుండెను. ఆకాలమునాడు వేంగీదేశమున మంత్ర వేత్తలు, ఐంద్రజాలికులు, పెక్కుమంది వర్థిల్లుచుండినట్లు, తారానాధుడను తిబెతుదేశీయుడు తన బౌద్ధధర్మ చరిత్రయందు దెలిపియున్నాడు. కావున తన కభిమానమైన బౌద్ధమతముపై నాదరములేని, పాపిష్టి దేశమని యు ఆన్ చ్వాంగ్, ఆంధ్రదేశమును సవిస్తరముగా వర్ణింపడని యూహించు కొనవచ్చును.

వేంగీదేశమునుండి మన యాత్రికుడు దక్షిణాభిముఖుడై చని మహాంధ్రమని బ్రశంసింపబడు ధాన్య కటక (ధరణికోట) దేశమునకు బోయెను. అతడీ దేశము నిట్లు వర్ణించెను.

"ధనకటకదేశ మారువేలలీలు వైశాల్యమును రాజధాని నలువదిలీలు వైశాల్యమును గలిగియున్నవి. భూమి సారవంతమై చక్కగా ఫలించుచు, సర్వసస్య సమృద్ధమై యున్నది. దేశము చాల భాగము చెట్లు చేమలు లేని యెడారివలె నున్నది. పట్టణములందును జనులు విశేషముగాలేరు. దేశముష్ణ ప్రదేశము. ఇచ్చటి ప్రజలు పసుపు పచ్చగానుండి చామన చాయగలవారు. భయంకర స్వరూపులును, తొందరపాటు గలవారుగా నున్నారు. కాని విద్యా గోష్ఠియన్న, వీరలకు చాలయిష్టము. ఈప్రాంతమున ననేక సంఘారామ