పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/58

ఈ పుట ఆమోదించబడ్డది

ఈతని గురువులపేరు రాహులభద్రుడు. అతడుబౌద్ధమతము స్వీకరించిన బ్రాహ్మణుడు.

కోసలదేశమునేలు రాజుపేరు, (సో టో-పోహా, అనగా) సాద్వహుడని, యుఆన్‌చ్వాంగ్ చెప్పుచున్నాడు. ప్రాచీన చీనాలిపిలో సో-టో-పో-హా యని వ్రాయబడిన సంస్కృత పదము శాలివాహన లేక సాతవాహన, గావచ్చునని పండితుల యభిప్రాయము. ఈచింగ్ అను చీనాయాత్రికుడు కూడ, నాగార్జునుని పోషకుడు (దానపతి షా-టో-పో-హ-నా-అనగా) శాతవాహన వంశజుడని చెప్పియున్నాడు, ఆతని పేరు షి-యేన్-టేక-యని కూడ బేర్కొనియున్నాడు. చరిత్ర దెలుపునంతవఱకు ఆంధ్రసామ్రాజ్యమును శాతవాహన వంశము ఇంచుమించుగా నాలుగు శతాబ్దములకాల మేలి యుండెను. ఇంతమంది శాతవాహునులలో నాగార్జునుడే శాతవాహనునిచే బోషింపబడియెనో దెలిసికొనుటకు యుఆన్‌చ్వాంగ్ దోడ్పడుటలేదు. ఇక ఈచింగ్ చెప్పిన షి-యేన్-టీ-క యను పేరు సంస్కృతమున జేతక లేక జీవాతక యను పదమునకు సరిపోవుచున్నది[1]. కాని యీపేరుగల రాజెవ్వరును చరిత్రయందు గాన్పించుటలేదు. తిబేతుదేశ గ్రంథములందు నాగార్జునుని మిత్రుడును, దానపతియగు వాని పేరు శాతవాహనుడు, లేక అంతివాహనుడు అని వివిధములుగా బేర్కొన బడియున్నది. ఆ వంశముననాతడు శంకరుడు,

  1. Takakasu "Itsing" p 159.