పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/46

ఈ పుట ఆమోదించబడ్డది

మును నిర్మించునపుడు అనేక వేలమందిజనులు హతులైరి. కోశము అర్థసూన్య మయ్యెను. అప్పటి కింకను తలపెట్టిన కార్యము సగమైన పూర్తి కాలేదు. అందుల కాతడు వ్యాకులచిత్తుడై దు:ఖింప నారంభించెను. రాజు ఖిన్నుడై మనోవ్యధనొందుచుండుట నాగార్జునుడు గాంచి యొకనాడు రాజా! నీ వేల ఖిన్నుడవై యున్నావని యడిగెను. సాద్విహు డందులకు విచారముతో "బోథిసత్త్వుడా! నేనీ మహత్కార్యమును పేరాసతో బుణ్యముకొరకై సంకల్పించితిని. ఇయ్యది మైత్రేయ బోధిసత్త్వుడు సుగతుడై యవతరించుదాక నిలచి యుండవలయునని నా యుద్దేశము కాని ఇది ఇంకను సగమైన పూర్తి కాలేదు. నా అర్థకోశము క్షీణించి నాజనులు అలసి, చనిపోవుచున్నారు. నా కేమియు దోచుటలేదు. అని విన్నవించెను. నాగార్జును డంతట "రాజా దుఖింపకుము; సయ్రపత్నము ఫలమును బడయక ఫొరాదు ధర్మమందు నీకుగల అభి నివేశమువలన నీ యభీష్టము తప్పక సిద్ధించును. భీతిల్లకుము, నిశ్చింతతో నీరేయి అంతపురమున కరిగి సుఖముగా నిద్రింపుము. రేపటి యుదయమ వ్యాహ్యాళికిబోయి, యీ చుట్టుప్రక్కల ప్రాంతమునంతయు బరీక్షించి, వచ్చిన పిదప నీతో నీ ప్రయత్నములగూర్చి ముచ్చటింతును" అని హెచ్చరించి యోదార్చెను. రాజా వాక్యములను విని, యానందభరితుడై నాగార్జునునికి బ్రణమిల్లి యధేచ్చం జనియెను.