పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/23

ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రదేశము-విదేశయాత్రకులు

ప్రేమానురాగమును త్రెంపుకొనజాలడయ్యెను. అంతమాత్రమున నీతని మతావేశమునకు ఏలోపమును జూపింపజాలము. భరతవర్షము, అందలి మహాత్మ్యములు, పవిత్రక్షేత్రములు, భారతీయుల ప్రతిభ, అన్నియు నతనికి ఆశ్చర్యము, భక్తి, గౌరవమును కలిగించినను, స్వదేశముమిాదను పైత్రానుగతమైన సంప్రదాయముల మిాదను అభిమానమును అణిగిపోనీయలేదు. అరువదియేండ్లు గడచిన ముదుసలియయ్యు, తన తలిదండ్రుల ను ఖననము చేసిన తావులందు గట్టబడిన సమాధులు, శిధిలములయినవని తెలినపుడాతడు, చక్రవర్తి సెలవు గైకొని, తన పితృదేవతలకు, మంచిచోట శాశ్వతముగ నుండగల సమాధులను నిర్మించెను.

బౌద్ధసన్నాసియు, సంఘమున కధిపతియై, మతము ననుసరించునప్పుడు యుఁఆన్‌ చ్వాంగ్‌ ఆచార వ్యవహార ములందు పట్టుదల, మూఢవిశ్వాసమును ఎక్కువ జూపియుండెను. తన పాలనమందున్న సన్యాసులు ఆచార నియమములు యధావిధిగ జరుపునట్లు శాసించుచుండెను. అయిను అతని మతములో విశాలహృదయము లేకపోలేదు. పరమత సహనము లేకపోలేదు. అతఁడు తానుతలచినది యెట్టి యాటంకములు వాటిల్లినను నెరవేర వలయునని దృఢనిశ్చయముగలవాడు. ఆకరణమున నాతఁడొకటి రెండుసార్లు తగచుఁదెచ్చుకొనెను. అతడు సాహసుడు. ధైర్యశాలి, స్వాతంత్రప్రియుడు. ఈప్రపంచమున నాతఁ డెవ్వ