పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/207

ఈ పుట ఆమోదించబడ్డది

వలసి వచ్చెను. ఖూర్‌పకాన్ రేవునుండి బయలుదేరి సురక్షితముగా హార్మజు రేవున సఫార్ నె 12 వ తేదీని మధ్యాహ్నమగునప్పటికి లంగరు దింపితిమి. ఆనాడు శుక్రవారము.

హానూరు రేవునుండి హురుమంజి (హర్మజు) రేవునకు మాకు పయనము చేయుటకు డెబ్బదియైదుదినములు పట్టెను."

యిమ్మడి దేవరాయల పరిపాలనము

రాయబారి అబ్దుర్‌రజాక్ సందర్శించిన దినములలో, కర్ణాటాంధ్ర మహాసామ్రాజ్యమును యిమ్మడి దేవరాయలు (లేక దేవరాయాభిదానులలో రెండవవాడు) పరిపాలించుచుండెను. ఇమ్మడిదేవరాయల వంశము చరిత్రయందు సంగమ వంశమున బిలువబడు చున్నది. విజయనగర సామ్రాజ్యమును, స్థాపించి, దక్షిణ హిందూదేశమునకు రెండున్నర శతాబ్దముల కాలము తురకలవలన హిందూసంఘము. మతము, సాంకరముజెంది, స్వాతంత్ర్యము నశింపకుండ నరికట్టగలుగుటకు బునాదులువేసిన దీసంగమవంశమే! విజయనగర రాజ్యమును నెలకొల్పినది సంగమరాజుకుమారులు హరిహరరాయ బుక్కరాయాదులు. ఒకవంకనుత్తరమున, బహమనీసుల్తాను మహమ్మదు, ఫిరోజుషాహిలవల్ల నేయాపదయు వాటిల్లకుండ, జూచుకొనుచు చెదరిపోయిన, దక్షిణ రాజ్యములనన్నింటిని, సంగమవంశజుల పరిపాలనము క్రిందకుదెచ్చి, సామ్రాజ్యమును రక్షించి వృద్ధిచేసినాడు. రెండవ బుక్కరాయలు. ఆతనివెనుక, విజయనగర