పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/192

ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రపటములు వ్రేలాడగట్టబడి యున్నవి. ఆచిత్తరువులలో పక్షులు, జంతువులు, మృగములు, మనుష్యులు, స్త్రీలు, మున్నగునవి యనేకములు చిత్రింపబడియున్నవి. ఇవియన్నియు, నత్యాశ్చర్యకర మైన కళాచాతుర్వముతో చిత్రింపబడిన చిత్తరువులు కాని యొండుకావు. ఇచ్చటి మందిరములలో కొన్ని పాంచాలికాయంత్ర నిర్మితములయినవి గలవు. అనియూరక యప్పుడప్పుడు ప్రదక్షిణము సేయుచుండును. అవి, యొక్కొక్క, ప్రదక్షిణమునందు ఒక్కొక్కవింత రూపమును దాల్చుచుండును. మరియు ప్రతిక్షణమునందును ఆమందిరములు క్రొత్తక్రొత్త శృంగారములతో మనోహరముగ గన్పట్టుచుండును. ఒకమారు చూచి తనవినొందుటకు వీలులేనియందములు, వింతలు, వర్ణింపనలవిగాని శృంగారములు, నాబయలునం దెచ్చట చూచినను గానవచ్చుచుండెను.

"అబయలున కెదురుగా సోపానమంటప మొకటి నిర్మింపబడెను. ఆసోపాన మంటపము స్తంభములపై కట్టబడెను. ఆసోపాన మంటపమునకు తొమ్మిది విశాలములైన అంతస్తులుగలవు. తొమ్మిదవదానిపై రాయలు సింహావస్థుడై కొలువుదీరి యుండెను. నాకీ సోపానమంటపము మీద నేడవయంతస్తు మీద, నాసనమిప్పింపబడి యుండెను. అచ్చట నాపరివారమును, ప్రాణమిత్రులును తప్ప నితరునెవ్వరికిని స్థల మిప్పింప బడలేదు. ఈసోపానమంటపమునకును, మైదానములో నిర్మింపబడిన మందిరములకును నడుమగల విశాలమయిన బయలు నందు వింతవింత విష