పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/182

ఈ పుట ఆమోదించబడ్డది

"మీరాజు అత్యంతాదర గౌరవములతో పుత్తెంచిన రాయబారమును, ఈలేఖను గాంచుటచే నాహృదయము పరమానందభరితమైనది."...నేనాసమయమున నూపిరి సలుపకుండునంతటి దట్టముగా నుడుపులను ధరించినవాడ నగుటచే, తమకమును దాచుకొనజాలమి వలన యుష్ణము పైకుబికి, నాకు ముచ్చెమ్మటలు గ్రమ్మజేసి వైచెను. అంతట నేను చెమటచే బాధనొందు చుండ కరుణార్ద్ర హృదయుడైన రాయలు, తమచేత నున్న వట్టివేళ్ళవీవనను విసరుకొనుటకై నాకు ప్రసాదించిరి. ఆమహా గౌరవమునకు నేను మిక్కిలి అలరితిని. ఇంతలో సేవకులు కొందఱు ఒక బంగరు పళ్ళెములో రెండుమోదల తమలపాకులును, ఇన్ని పోకలును, సుగంధ ద్రవ్యములును, అయిదు నూర్ల పణములగల నొక పట్టుసంచియు, నిరువది దీనారము లెత్తు పచ్చకర్పూరమును, దెచ్చియొసంగిరి. ఆ కర్పూరతాంబూల మందిన తరువాత రాయలు సెలవు తీసికొనుట కనుజ్ఞ నిచ్చిన విడిదికి వచ్చిచేరితిని. నాకు విజయనగరమున నున్నంతకాలము దినవెచ్చమునకై రెండుగొఱ్ఱెలు, ఎనిమిదికోళ్లు, ఒక మణుగు నేయి, ఒకమణుగు పంచదార, రెండువరహాలును, పంపబడుచుండెను. ఈరీతిగ నేను ఆనగరముననున్నంత వఱకు జరుగుచునే యుండెను. వారమునకు రెండుపర్యాయములు, రాయలుతనకొలువునకునన్ను బిలువనంపుచుండెను. సాయంతనపువేళ, నేను సముఖమున కరిగినపుడు, రాయలప్పుడప్పుడు మాయేలికయగు ఖాకాని సయ్యదు సుల్తాను వారినిగూర్చికుశల