పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/176

ఈ పుట ఆమోదించబడ్డది

కులు ఏనుగులను సింహళమునుండి గూడ, ఈదేశమునకు గొనివచ్చి వాటియెత్తును బట్టి, గజమున కింత థరయని నిర్ణయించి యమ్ముచుందురు.

వేశ్య వాటికలు.

"టంకసాల కెదురుగా, కటక పాలుని, కచ్చేరి యున్నది. ఆతని క్రింద ఆనగరక్షణమునకై పండ్రెండు వేలమంది పడికావలి వాండ్రు గలరు. వారికి జీతము క్రింద ప్రతిదినమును మనిషి కొకపణము చొప్పున వేశ్య వాటికల వలన పండ్రెండు వేల పణముల సుంకము వసూలు చేయ బడుచుండును. వేశ్యవాటిక యందలి, వెలయాండ్ర హర్మ్య, సౌధముల విభ్రమ వైభవ సంపదలు, అవ్వీటి విలాసనీతతుల సౌందర్యము మొల్కలేనగవుతో ముద్దుగురియు చున్నవారి నెమ్మోములు, వారి యొయ్యారపు నడకలు, తళుకులు ఎంతటివానినైన వలపించువారి నేర్పరితనపు మినుకులు, మోహనాస్పదములయిన వారి చూపులు ఆహా! హా! వర్ణింపనాకు శక్యముగాదు. వర్ణింప మొదలు వెట్టిన నాకుకూడ మనసు చలించును గావున నింతటితో వారవనితుల విలాసములు వర్ణింప విరమింతును.

"వేశ్యవాటికనుగూర్చి యొకమాట మాత్రము చెప్పక తప్పదు. టంకసాల వెనుక నించుమించుగా నిరువదిగజముల వెడల్పును మూడువందల గజముల పొడవును గల యొక వీధిగలదు. ఆవీథి కిరుప్రక్కలను చక్కని పూబొదరిండ్లతో నిండిన ముంగిట వాకిళ్ళుగల శోభనగృహములు బారులు తీర్చి