ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునేడవ ప్రకరణము

93


డాశ్చర్యపడి ఖిన్నుఁడై భయంపడెను, జీవానందునివలెనే భవానందుఁడును మహేంద్రుని భార్యను శిశువునుగూడ చూచి యుండ లేదు. జీవానందుఁ డే కారణముచే మహేంద్రుని భార్యయును బిడ్డనుగానుండవచ్చునని యూహించెనో యాకారణము భవానందునికి గోచరింపలేదు. అతఁడు బ్రహ్మచారిని మహేంద్రుని సహితముగా పట్టుకొని పోయినదియు చూచి యుండలేదు. బిడ్డయు నచ్చట నుండ లేదు ఆడబ్బినిచూచి, 'యెవరోరమణీమణి విషమునుగ్రోలి ప్రాణము విడిచిన' దని నిశ్చయించెను. భవానందుఁ డాశవసమీపంబునఁ గూర్చుండి దాని కపోలముపై చేయిడి పెద్ద ప్రొద్దు చింతించి, పిమ్మట తల, చేతులు, కాళ్లు మొదలగు నవయవము లందు చేయిడి చూచెను, మరల ననేక విధములుగా ఇతరులకుఁ దెలియని పరీక్షలను జేసెను, ఇంకను ప్రాణ మున్నదని తెలిసికొనెనుగాని, బ్రతికించుమార్గ మెయ్యది యను సాలోచనయందు మగ్నుఁడాయెను. మఱికొంత సేపటికి యడవి కేఁగి, యొక చెట్టునుండి కొన్ని యాకులను గ్రహించి చేతితో నలిపి రసమును శవముయొక్క నోటిలోఁబోసి వ్రేళ్లచ కంఠ పర్యంతము పోవునట్లు చేసినదేగాక, కనులయందును నాసికారంధ్రములందును ఆరసమునే కొంచెము కొంచెముగా విడిచెను. మఱియు శరీరమంతయుఁ బూసెను. ఇట్లు క్షణక్షణంబును జేయుచు, అపుడపుడు నాసికాగ్రంబునం జేయిడి యూపిరివచ్చుటను గని పెట్టుచుండెను. తన ప్రయత్నము విఫలమైన ట్లగుపడేను. ఇట్లు చాల సేపు పరీక్షించు చుండఁగా నాశవ ముఖము కొంచెము ప్రఫుల్ల మాయెసు. శ్వాసము వ్రేలికి కొంచెము సోఁకెను, మరల నాయాకుల రసమునే పిండెను.