ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

ఆనందమఠము


మనఁగా, ఈ వ్రతభంగమునకుఁ బాయశ్చిత్త మేమి ?' అని యడిగెను,

జీవానంద ——ప్రాయశ్చిత్తము——దానము —— ఉపవాసము——ఇరువది రెండు గవ్వలు.

శాంతి కొంచెము నవ్వి, 'ప్రాయశ్చిత్తమనఁగా నేమో నాకుఁ దెలియదు, ఒక యపరాధంబున కేమిప్రాయశ్చిత్తమో, శతాపరాధంబులకు నదియే ప్రాయశ్చిత్తమా!' యని యడిగెను.

జీవానందుఁడు, విస్మీతుఁడును విషణ్ణుఁడునై 'యీమాట లేల?' యనెను.

శాంతి—— నేను నిన్ను వేడుకొను టేమనఁగా ఇఁకనీవు నన్నుఁజూడ ప్రాయశ్చిత్తము చేసికొనవలదు 'అనెను.

జీవానందుఁడు నవ్వి, 'ఆ విచారంబున నిశ్చింతలో నుండుము; నిన్నుఁ జూడక నేను జచ్చుట లేదు; చచ్చునంతటి యవసరమును లేదు; నే నిఁక నిట నుండుట లేదు; అయినను, ఇప్పుడు నిన్ను కన్ను లారఁ జూడఁజూలను, 'నేను జూడనని తలంపకుము. ఇపుడు గాకున్న నింకోకప్పుడైనఁ గనులారఁజూతును. ఇపుడు పోయెదను. ఇంకోకప్పుడైన నామనోరథము సఫల మగును, పోయెద. నీవు నామాటను నెఱవేర్చవలయును; ఏమన ఈవస్త్రమును పాఱవేసి మన పెద్దల యింటికిఁ బోయి వసించుచుండుము.” అనెను.

శాంతి—— ఇపుడు నీ వెక్కడికి పోదువు ?

జీవానంద—— బ్రహ్మచారిని వెదకుటకై మఠంబునకు పోయెదను. వారు నగరంబునకుఁ బోయి యున్నారు. వారి యవ