ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునాఱవ ప్రకరణము

89


ములు; ఒక ప్రక్కను వ్రత యజ్ఞ యాగ హోమములు; వేఱోక ప్రక్కను నీవు; నీవొక్క దానవుమాత్ర మే——నే ననేకవిధం బులుగాఁ దలపోసినను ఏవైపున బరు వగునో, దాని నిర్ధరింపఁ జాలకున్నాను. దేశమేమో శాంతిగ నున్నది. దేశంబును గట్టుకొని నేనేమి చేయఁగలను. దేశమునం దొక్క. యెకరా భూమి యుండినచో నిన్నుంచుకొని స్వర్గానుభవభోగంబు లనుభవింపఁగలను నాకు దేశముతోఁ బని యేమి? గుణవతియగు నిన్ను వరించియు త్యజించితిని. ఇంతకంటే దేశంబున నెవఁడు దుఃఖియగును నీమలినమైన ఛిద్ర వస్త్రంబును జూచి యూరకుండు వానికన్నను, దేశంబున దౌర్భాగ్యుండగు దుర్బలుం డెవ్వడు గలఁడు ! నా సకలధర్మములకును. నీవు సహకారిణివి. దానినే త్యజించిన పిమ్మట, నంతకన్న మిన్నయగు సనాతనధర్మం బేమున్నది . నేను ఏధర్మంబు కోఱకై దేశ దేశంబులును వనవనంబులును తుపాకీని భుజము పై నుంచుకొని తిరిగి తిరిగి ప్రాణి హింస చేయుచు పాప కార్యంబును సంగ్రహింప వలయును ? పృథ్వి సంతానుల వశమగునో కాదో నేఁ జెప్పఁజాల. నీవేమో నాకు వశురాలవై యున్నావు. నీ వీపృథ్వికన్న నెక్కుడు దానవు. నీవే నాకు స్వర్గము. ఇఁక నడువుము. ఇంటికిఁబోవుదము; నే నిఁకఁ బోవుట లేదు.

శాంతి కొంచెము సేపు మాటలాడ కూరకుండి, పిమ్మట 'సరి కాదు, నీవు వీరుఁడవు, నేను వీరపత్నినై యుండుట నాకుఁ బరమసుఖమై యున్నది. నీ వీయధమురాలికై ధర్మ త్యాగంబు జేయఁదగదు ? నీవు నన్నుఁ ప్రేమింపకుము, నేనా సుఖంబు నపేక్షించుట లేదు. ఇపుకు నాకొకమాటఁ జెప్పి పొమ్ము; ఏ