ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

ఆనందమఠము


మనోమధ్యంబున ప్రతిభవ లెను, శబ్దమధ్యమున సంగీతము వలెను, దుఃఖమధ్యమున సుఖమువలేను, ఆరూపరాశియం దేదియో యొక్కొక అనిర్వచనీయమైన తేజముండెను, అంతియగాక, అనిర్వచనీయమైన మాధుర్యము, అనిర్వచనీయ మైన ఉన్నతభావము, అనిర్వచనీయమైన ప్రేమ, అనిర్వచనీయమైన భక్తి ఆమెయందు నెలకొని యుండెను. ఆమె నవ్వుచు నవ్వుచు (ఆనవ్వును పరు లెఱుంగరు) క్రొత్త చీర నెత్తి యిదిగో చూడుము ! అనెను నిమి 'చీరను కట్టుకొను' మనెను. అది 'నాకేల' యనెను.

అంత నిమాయిమణి, దాని కమనీయ మైన కంఠ దేశము నందు తన కమనీయమైన బాహువుల నుంచి, 'అన్న వచ్చి, యున్నాఁడు, నిన్ను రమని చెప్పినా' డనెను. ఆ యువతి, 'నన్ను రమ్మని చెప్పిరా ! దానికై క్రొత్తచీర యేల? ఇట్లే పోఁగూడదా యేమి ? ' యనెను. నిమాయిమణి, ఆ యువతి భుజములందు చేతుల నుంచి కొని ముందు నడచునట్లు త్రోయుచు కుటీరమునుండి బయటికి వచ్చి, 'చాలు గంతగుడ్డ చాలు, రా" అని చెప్పుచు, పిలుచుకొని వచ్చి, యామెను లోపల త్రోసి నిమాయిమణి వీధితలుపు గడియ వేసికొని బైట నిల్చి యుండెను,