ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

ఆనంద మఠము


జీవానందుఁడు, నీవు పిచ్చిదానవు. నీకుఁ గొంచె మైనను బుద్ధి లేదు. నీముఖమే చూడకూడదు, నీవుఁ జెప్పఁగూడని దానిని చెప్పితివి. ఇంక నే నిచ్చట నుండను. పోయెదను' అని చెప్పి లేచిపోవుట కుద్యుక్తుం డాయెను.

నిమి—— నేను పిచ్చిదాననా, అయిన నేమి? ఒక్క తేప వదినెను పిలుతునా? యనెను.

జీవా—— ఇదిగో పోయేద, అని చెప్పి వీథి కడపవఱకుఁ బోయెను.

నిమాయిమణి, కడపకు అడ్డముగా నిల్చి, 'మొదట నన్ను చంపి వేసి తర్వాత నీవు పో. వదినెను చూడక నీవు పోఁ గూడదు' అని ముష్కరముగాఁ జెప్పెను.

జీవా——నే నెందఱను చంపినది నీకుఁ దెలియునా?

నిమాయి, ఆమాటను విని కోపముతో. 'చాల కీర్తియే పెండ్లమును విడిచి పెట్టుట, కన్నవారిని చంపుట, మంచి పని యని యనుకొంటివే మొ? నీ వెవనికి కుమారుఁడవో, నే 'నాతనికిఁ గుమార్తెను. జనులను చంపు నీకు నన్ను చంపుటయు దౌలత్తు కాదా?' యనెను.

జీవానందుఁడు నవ్వి, 'పిలిచికొనిరా, నే నెవతెను కొంత కాలముదాఁకఁ జూడఁగూడ దని తలంచి యుంటినో దానిని పిలిచికొని వచ్చెద ననుచున్నావు, కాల మెట్లు నడపుచున్నదో అట్లు నడువవలయును కదా! యనెను.

నిమి, తనమనస్సునందు కార్యసాఫల్య మయిన దని సంతోషించుచు నవ్వుచు నవ్వుచు సమీపమునందున్న గుడి