ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునైదవ ప్రకరణము

83


జీవా——ఇం కేమున్నది?

నిమాయిమణి, మంచి పనసపం డొకటియున్నది, అని చెప్పి లోపలికిఁ బోయి తెచ్చి ముం దుంచెను. ఏమియు బదులు చెప్పక జీవానందగోస్వామి ఆపండును తినెను. నిమాయి నవ్వి, “అన్నా! ఇంకేమియు లేదే' యనెను.

జీవా—— అయిన నేమి, ఇం కొకనాఁటికి వచ్చి భోజనము చేసెదను.

అని చెప్పి లేచెను, చేతులు కడిగికొనుటకు నిమాయి నీ ళ్ళిచ్చెను. జీవానందుఁడు చేతులు కడిగికొనుచుండఁగా, నిమాయి మణి, 'అన్నా! నే నొకమాట చెప్పెదను, విని యాప్రకారము చేసెదవా?' యనెను.

జీవా—— అదేమి మాట?

నిమి——నాపై ఆన పెట్టుము.

జీవా—— ఏమి చెప్పుము?

నిమి—— ఆలాగు చేసెదవా?

జీవా—— ఆమాట మొదట చెప్పుము?

నిమి—— నీవు ఆన పెట్టు నీ కాలికి మ్రొక్కెదను.

జీవా——ఆన పెట్టితిని; కాళ్లకు మ్రొక్కు మనఁగా, నిమాయిమణి కాళ్లపైఁ బడఁగా ఆశీర్వదించి, లెమ్మని చెప్పి 'ఆమాట యేమో చెప్పుము' అనెను.

నిమాయిమణి, చేతులు రెంటిని గ్రుచ్చుకొని, తలవంచి కోని, కొంత సేపటికి మొగమెత్తి జీవానందునిఁజూచి నేలపై దృష్టి నిగుడించి, మరల తల యెత్తి నోరు విడిచి, ఒక తేప వదినెను పిలుతువా?' యనెను.