ఈ పుట అచ్చుదిద్దబడ్డది

79

పదునై దవప్రకరణము


వ్రేలాడఁగట్టి యుండెను. జను లందఱును దుర్భిక్షముచే పీడితులై కృశులై సంతాపితులై యుండిరి. అయినను, ఆయడవి యందు మనుష్యాహారము నకుం దగిన కొన్ని పదార్థము లున్నందున నా గ్రామస్థులు దానిని తెచ్చి తినుచు ప్రాణమును గాపాడు కొనుచుండిరి.


అచ్చట సున్న యొక మామిడితోఁటలో నొక చిన్న యిల్లును, దానినంటి మఱి నాలుగు చిన్న యిండ్లు నుండెను. ఆ యింటికి మట్టితో ప్రహరి యుండెను. ఆయింటి యజమానికి పశుసమృద్ధి కలదు. ఇంటిముందు కోఁతి, చిలుక, నెమిలి, జింక ఇవి ఒక్కొక్కటి యొక్కొకపంజరమున నుంపఁబడి యుండెను, తోఁటలో మల్లె చెట్లు నిమ్మ చెట్టు నుండెను, ప్రతి యింటిలోను నూలువడకు రాట్నము లుండెను. ఈ యింటిలోను నోక రాట్న ముండెను. అయినను, జనులు చాలమంది లేరు. జీవానందుఁడు, బిడ్డ నెత్తికొని యీ యింటికిఁ బోయెను.

ఈయింటి లోనికిఁ బోయి జీవానందుఁ డొక రాట్నము దెచ్చి త్రిప్పి ఝరఝర శబ్దము చేసెను. ఆ బిడ్డ రాట్నము నెప్పుడును జూచినది కాదు. ఆ శిశువు తల్లిని విడిచినది మొదలు ఏడ్చుచునే యుండెను. తల్లి మృతి నొందిన దని యా శిశువునకుం దెలియునా? నిద్ర పోవుచున్న దని యనుకొని యుండెనేమో! ఆహా ! తల్లీ యందు పిల్ల కెంత ప్రేమ యున్నదని చదువరు లెఱుంగుదురుగాత, ఇప్పుడు రాట్నపుశబ్దమును విని భయపడి మఱింతగట్టిగా నేడ్వసాగెను. ఈధ్వని విని లోపల నుండి సుమారు పదునేడు పదునెనిమిది సంవవత్సరముల వయస్సు గల యొక యువతి కుడి చెంపమీఁద కుడిచేతి చూపుడు వ్రేలు