ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

ఆనందమఠము


సందఠాకూరు ఇచ్చటనే యెక్కడనైన నుండును. వాఁడు వచ్చి యీస్త్రీని సంస్కారము చేయును, అని యెంచికొని, బిడ్డ నెత్తుకొని పోయెను.

జీవానందగోస్వామి, ఆనిబిడమైన యరణ్యమార్గముగా బిడ్డ నెత్తుకొనిపోయి యొక చిన్న గ్రామమును జేరెను. ఆయూరి పేరు భైరవపురము; అయినను, జనులు భరయీపుర మని చెప్పుచుండిరి, ఆయూరిలో సామాన్య జనులు కొందఱే యుం డిరి. సమీపమున వేఱె పెద్ద గ్రామ మేదియు లేదు. ఆగ్రామము చుట్టును పెద్దయడవి; మహారణ్యము నడుమ నీచిన్న పల్లె మిగుల రమణీయముగా నుండెను. కోమలమైన పచ్చికగల భూమిగ నుండెను. శ్యామల పల్లవయుక్తమైన మామిడి చెట్లును పనస చెట్లును రమ్యముగ నుండెను తాఁటితోఁపును కలదు. దానికి సమీపమున నీలజలపూర్ణమైన తటాకము అందు బక కారండవాది జలచరపక్షులు చూపున కిం పొనర్చుచుండెను. తీరమునందలి వ్రుక్షములయందు కోకిల చక్రవాకాది పక్షులు కలకలధ్వని చేయుచుండెను. కొంచెము దూరముగనుండి మయూర కేకాస్వరము వినవచ్చెను. ప్రతియింటి ముంగిటిలోను ఆవులు ఎసుములు కట్టియుండెను. లోపల గాదె లుండినవిగాని దుర్భిక్ష కాల మగుటచే వానిలో ధాన్యము లేదు, ఒక్కొక యింటివసారాలోను చిలుకలయు గోరువంకలయుపంజరములు వ్రేలాడుచుండెను, కొన్ని యిండ్లకు సున్నము గొట్టి ఎఱ్ఱమన్ను పెట్టి పిండి ముగ్గు లుంచి యలంకృతము చేసి యుండెను. కొన్ని యిండ్లముందు ఊరుగాయలు, వరుగులు, వడియము లెండఁ బెట్టి యుండిరి. కొన్ని యిండ్లలో మోదుగాకుల తోరణములు