ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునైదవ ప్రకరణము

77


జీవానందునికి మహాప్రభు సంకేతము లన్నియుఁ జక్కఁగా దెలియును.

ధీరసమీరే తటినీతీరే,
వసతి వనే పరనారీ.”

మహా ప్రభువు యొక్క యీగీతమును విని, నదీతీరమునం దెవరో యొక స్త్రీ అన్నము లేక మలమల మాడుచున్నదని తెలిసికొని జీవానందుఁడు నదీతీరముగనే నడిచి వచ్చుచుండెను. జీవానందుఁడు బ్రహ్మచారిని పట్టుకొని పోవుటకు తనకన్ను లారఁ జూచినాఁడు. కనుక ముందుగా నాతని విడిపింపవలసినది వానికి ముఖ్యకర్తవ్యముగా నుండెను. అయినను, జీవానందుని ఉక్త సంకేత గానమువలన, బ్రహ్మచారిని విడిపించుట ముఖ్యకర్తవ్యమని భావింపక, ఆతనియాజ్ఞను పాలించుటయే ముఖ్య కార్యమని తలంచి, యాపనినే ముందుగా నెరవేర్పవలయు నని సంకల్పము చేసికొనెను.

జీవానందుఁడు నదీతీరము నంటి పోవుచుండెను, కొంతదూరము పోయినమీద నొక చోట చెట్టు క్రింద ఒక స్త్రీ మృత కళేబరమును, ఒక బ్రతికియున్న ఆఁడుబిడ్డను గాంచెను. జీవానందుఁడు మహేంద్రుని పెండ్లమును బిడ్డను ఎప్పుడును జూచినవాఁడు కాఁ డనునది పాఠకులకుఁ దెలిసియే యున్నది. అయినను, వీరు మహేంద్రుని పెండ్లము బిడ్డలుగ నుందురేమో యని తలంచెను. ఏలన, మహేంద్రుఁడు తన ప్రభువుతోఁగూడ పోయినదియు వానికిఁ దెలియదు. ఎట్టులైననుసరే, తల్లి చచ్చి బిడ్డ బ్రతికి యున్నది, జీవానందుఁడు, మొదట బిడ్డను రక్షించవలయును; లేనిచో అడవిమృగములపాలై పోవును. భవా