ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

ఆనందమఠము


మహేంద్ర——తాము నిశ్చయముగా సిద్ధపురుషులు, అయినను నేను తమ్ము విడిచి యుండువాఁడను కాను.

సత్యా——అట్లయినచో నుండుము, మనమిర్వురము వేఱు విధముగా విడివడి పోవుదము.

ధీరానందుఁడు వెడలిపోయెను. సత్యానందుఁడును, మహేంద్ర సింహుఁడును కారాగృహముననే యుండిరి.


పదునైదవ ప్రకరణము

మహేంద్రునికూఁతురు సంరక్షింపబడుట.

బ్రహచారి చేయుగానమును అనేకులు వినిరి. వారిలో జీవానందుఁడును ఆ గానమును వినెను. మహేంద్రుని అనువర్తియై వానిని జూచికొనవలసినదని జీవానందునికి బ్రహ్మచారి యాజ్ఞయైన విషయము పాఠకమహాశయునకు విదితమేకదా! మార్గమునందు ఒక్క స్త్రీని జూచెను. అది యేడు దినముల నుండి పస్తుగా పడి యుండెను, ఆమెకు జీ దానము చేయుటకు జీవానందునికి రెండు మూడు గడియలసేపు విళంబ మయ్యెను. ఆస్త్రీని బ్రతికించి తిట్టుచు పిలిచికొని వచ్చెను. (అవకాశమునకు ఆస్త్రీ యే కారణము) వచ్చునపుడు తన ప్రభువైన బ్రహ్మచారిని ముసల్తానులు పట్టుకొనిపోవుటను జూచినదేగాకఁ ఆప్రభువు చేయు గానము చెవిని సోఁకెను.