ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునాలవ ప్రకరణము

75


మహేంద్రుఁడు 'మొదట విస్మితుఁ డయ్యెను. అనంతరము అబధ్ధ మని యెంచుకొని పరీక్షార్థము బయట పోయెను, ఎవరుసు ఆటంకము చేయలేదు. మహేంద్రుడు వీధివఱకును బోయెను.

ఆగంతకుఁడు, సత్యానందుని జూచి —— మహారాజా ! తామేల పోవుట లేదు ! నేను తమకొఱకేకదా వచ్చినది' యనెను.

సత్యా ——నీ వెవరు ? ధీరానందగోస్వామివా?

ధీరా——ఔను, మహాస్వామి.

సత్యా —— నీవు పహరావాఁ డైన దెట్లు?

దీరా—— భవానందుఁడు నన్ను పంపించెను. నేను నగరమునకు వచ్చి, తాము కారాగృహమునం దున్నట్లు తెలిసికొని, కొన్ని దుత్తూర మిశ్రమమైన గుళికలతో నిచ్చటికి వచ్చితిని. వాఁడు దానిని తిని మైమఱచి భూశాయియై పడి యున్నాఁడు. నేను ధరించి కొనియుండు కోటు, షరాయి, టోపి, బళ్లేము ఇవి ఆ సాహేబువే.

సత్యా——నీవు దీనిని ధరించుకొని పొమ్ము. నే నిప్పుడే బయలు వెడలను,

ధీరా——ఏల ? కారణ మేమి ?

సత్యా——ఈదినము సంతానుల పరీక్ష,

మహేంద్రుఁడు మరలి వచ్చెను. సత్యానందుఁడు చూచి 'ఏల మరలవచ్చితివి' అని యడిగెను.