ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

ఆనందమఠము


మహేంద్రుఁడు విస్తితుఁడై —— అతని మాటను నమ్మక 'తమ కెట్లు తెలిసినది. తాము నాతోఁగూడ నేకదా యున్నారు' అనెను.

సత్యా —— నేనీమహా వ్రతదీక్ష, చేసియున్నాఁడను, దేవుఁడు దయ చేసి పరోక్షజ్ఞానము నా కిప్పించి యున్నాఁడు. ఈ రాత్రి లోపల నీకు సమాచారము వచ్చును. ఈరాత్రి కే నీవు కారాగారమునుండి విడివడుదువు.

మహేంద్రుఁ డేమియు నన లేదు. సత్యానందుఁడు, తాను జెప్పినమాటలలో మహేంద్రునికి నమ్మకము కలుగ లేదనితోఁచి, “నీవు నమ్మవా ! కావలసినయెడల పరీక్ష చేసి చూడుము' అని చెప్పి కారాగార ద్వారముదాఁక వచ్చెను. అచ్చట నేమి చేసినదియు మహేంద్రునికిఁ దెలియదు. అయినను, ఎవరితోడనో మాటలాడుచున్నట్లు బోధ మయ్యెను. సత్యానందుఁడు మరలి వచ్చెను. మహేంద్రుం 'డేమిపరిక్ష చేయవలయు' నని యడిగెను.

సత్యా——నీవు ఇప్పుడు కారాగారమునుండి విముక్తుఁడ వగుదువు.

ఇట్లు చెప్పుచుండు నంతలో కారాగారద్వారము తేఱువఁ బడెను. ఒకానొకఁడు లోపలికి వచ్చి, “మహేంద్ర సింహుఁడను వాఁడెవ' డనెను.

మహేంద్ర —— నేనే.

ఆగంతకుఁడు - 'నిన్ను విడుదల చేయుటకు హుకుం వచ్చియున్నది. నీవు పోవచ్చు ' ననెను.