ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

ఆనందమఠము


గలదు. దానికి మియాక్షేపము కలదా?' యని యడిగెను. సత్యానందుఁడు మంచివాఁడని జమేదారునకు తోఁచి యున్నందున, 'నీవు హరికీర్తనము చేయుము, నీవు వృద్ధ బ్రహచారివి. నిన్ను విడిచి పెట్టుటకు హుకుం అగును. ఈ చెడ్డనునిషిని మాత్రము గల్లుకు వేయుదు' రనెను. అంత బ్రహచారి మృదు మధురస్వరముతో——

ధీరసమీ, తటినీతీరే
       వసతి వనే వరనారీ
మాకురు ధనుర్ధర, గమనవిళంబన
       మతివిధురా వరనారి,

అని యిట్లు పాడెను.

అందఱును నగరము చేరిరి, జమేదారు. వీరిని కొత్వాలు నొద్దకు పిలుచుకొని పోయెను. కొత్వాలు రాజసర్కారుకు రిపోర్టు చేసి,బ్రహ్మచారిని మహేంద్రుని తత్కాలమున పహరాలో" నుంచెను. ఆకారాగారము అతిభయంకరముగా నుండెను. అచ్చటికిఁ బోయినవాడు బైటికి వచ్చుట లేదు. ఏలన విచారించువారే లేరు. ఇంగ్లీషు దౌలతు జైలుగా నుండెను, అపుడు, ఇంగ్లీషు వారికి అధికారము లేదు. ఇపుడు చట్టము ప్రబలిన కాలము అప్పు డానియమ, మేమియు లేని కాలము, నియమముండు కాలమునకును నియమము లేని కాలమునకును మొ కాబిలా చేసి చూడుఁడు.