ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదుమూఁడవ ప్రకరణము

71


కల్యాణి మృతశరీరమునకును, జిడ్డకును' రక్షకు లెవరును లేరు. ఆచెట్టు క్రిందనే పడి యుండిరి.

మహేంద్రుడు మొదట శోకాభిభూతుఁడై వెంటనే యీశ్వర ప్రేమచే ఉన్నత్తుఁడై చేతనశూన్యుం డైనవానివలె నుండెను, ఏమైనది, ఏమి కాఁబోవుచున్నది, అను దానిని తెలియనివాడై తనబంధనముపై దృష్టినించ లేదు. అయినను, ఒకటి రెండడుగులు నడిచినమీఁద తన్ను పట్టుకొనిపోవుచున్నారని తెలిసికోనెను. కల్యాణిశవము పడియున్నది, సంస్కారము చేయలేదు. బిడ్డ దిక్కు లేక యడవిమృగముల పాలగును, అని యతనిమనస్సునకుఁ దోఁచెను. ఈరీతి భావోదయమైన వెంటనే మహేంద్రుఁడు రెండు చేతులను బలముగా లాగెను కట్టు తెగిపోయెను తత్ క్షణమే జమేదారుని తన్ని పడంద్రోసెను నాఁడు భూశయ్యాగతుఁ డాయెను. అప్పుడిద్దఱు సిపాయీలు వచ్చి మహేంద్రుని పట్టుకొనిరి. మహేంద్రుఁడు దుఖాకులిత చిత్తుఁడై సత్యానంద బ్రహ్మచారిని పిలిచి, 'మీరు కొంచెము సహాయము చేసినచో వీరైదుగురుసు హతము చేయుదు' ననెను. సత్యానందుఁడు, 'నా యీప్రాచీనశరీరము నందు బలమే మున్నది? నే నెవరినిపిలి చెరనో వాఁడుతప్ప వేఱు బలము లేదు. పోవుటయే మంచిది; మన మీయైదుగురను జయింపలేము, ఎక్కడికి పిలుచుకోనిపోయెదరో పోనీ, మనము పోయి చూతము; జగదీశ్వరుఁడు రక్షింపఁగలఁడు అని చెప్పెను. ఇర్వురును విడిపించుకొనుటకు ప్రయత్నము చేయక పోవుచుండిరి. కొంచెము దూరము పోయిన మీఁద సత్యానందుఁడు సిపాయీలను జూచి, 'అయ్యా! నేను హరికీర్తనము చేయు వాడుక