ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

ఆనందమఠము


జ్ఞానుసారముగా సన్న్యాసులను బట్టుకొనవలసినట్లు బరకందాజ మొదలగు వారికి ఉత్తరువు చేసిరి. ఆదుర్భిక్ష కాలమునందు నిజమైన సన్న్యా సు లొక్కెడ నిల్చుట లేదు. ఏలన, ఒక్క చోటనే యున్న పొట్టనిండుటకు వీలు లేనందున, దిక్కున కొకరుగాఁ బోయిరి. ఇట్లు నిజమైనసన్న్యాసులు కాశీ ప్రయాగ మొదలగుస్థలములకుఁ బోయి యుండిరి. కేవలము సంతానులు మాత్రము ఆవశ్యకమైనపుడు సన్న్యాసివస్త్ర ధారణము చేయుచు అనావశ్యక మైనపుడు యథారీతివస్త్రములు ధరించుచు నుండిరి. ఈగడబిడను విని చాలా మంది సన్న్యాసులు కషాయములను గట్టుటను మానివేసిరి. కాఁబట్టి పొట్టకు లేని రాజసేవకులు. సన్న్యాసు లుండుచోటు తెలియక, గృహస్థుల కుండ చట్లను పగులఁగొట్టి అరకడుపు నింపించుకొని వెనుకకు మరలుచుండిరి. సత్యానందుఁడుమాత్రము ఏకాలమునందును గైరిక వస్త్రమును పరిత్యజింపలేదు.

ఆకృష్ణకల్లోలినీ తీరమునం దొక చెట్టు క్రింద కల్యాణిపడి యుండెను. సత్యానందుఁడును మహేంద్రుడును పరస్పరము ఆలింగనము చేసికొని పాశ్రులోచనులై భగవంతుని ప్రార్థించు చుండిరి. నజరద్దీ౯ కమేదారు సిపాయీలను పిలిచికొని వచ్చుచుండెను, వాఁడు సత్యానందునిఁ జూచి 'వీఁడు మిగుల దుర్మార్గుఁ' డని తిట్టుచు మెడపై చేయి వైచెను. వేఱోకఁడు మహేంద్రుని పట్టుకొనెను. ఏ లన, సన్న్యాసి వెంట నుండువాఁ డును సన్న్యాసియే కదా. వేఱోకఁడు పచ్చిక పైఁబడియున్న శవశరీరమ'ను పట్టీడ్చెనుగాని, యామె స్త్రీశవ మని తెలిసి విడిచి పెట్టెను, వీరిర్వురన మాత్రము పట్టుకొని పోవుచుండిరి.