ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండ్రెండవ ప్రకరణము

67


నిడికొని, మృదువును అతిమధురమును అతి స్నేహమయమునైన కంఠస్వరముతో, పతినిఁజూచి, దేవతావాక్యము నుల్లంఘించుట కేరికిని సాధ్యము కాదు. దేవుఁడు నన్ను రమ్మని చెప్పియున్నాఁడు. ఉల్లంఘనము చేయరాదు. నేనొక్కతె పోయినందున నష్టమేమి ! మీరు గ్రహణము చేసియుండు వ్రతమును త్రికరణశుద్ధిగాఁ జేయుడు. పుణ్యము కల్గును. అందు నాకును స్వర్గలాభము కల్గును. మన మిరువురమును స్వర్గమునం దనంతభోగముల ననుభవింపవచ్చును.

ఇట్లుండఁగా బిడ్డ పాలు త్రాగెను. గుణము కనుపించెను. ఆబిడ్డ కడుపులోనికిం బోయి యున్న విషము మిగులఁ గొంచెమే యైనందున బ్రతికెను. అయినను, మహేంద్రుని దృష్టి బిడ్డవైపు పోలేదు. వాఁడు బిడ్డను భార్యను ఆలింగనము చేసికొని యేడ్చుచుండెను, అపు డరణ్యమునందు మృదువైన మేఘనాదమువలె గంభీర స్వరముతో,

హరే మురారే మధు కైటభారే
గోపాల గోవిన్ద ముకున్ద శౌరే.

అని వినంబడెను.

అపుడు కల్యాణికి విషము తల 'కెక్కుచుండెను. చేతనము కొంచెము కొంచెముగా తగ్గుచుండెను. ఆమె ప్రేమ భరితురాలై వైకుంఠమునం దుండి వేణునాదము నాలించుచున్న ట్లుండినది.

కల్యాణియు, అప్సరులకంఠమును నిందించుకంఠము వలెఁ దానును మోహభరితురాలై,