ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

ఆనందమఠము


కళ్యాణి——బదు లేమియుఁ జెప్పక భర్త పాదధూళిని తలపై నిడికొని, స్వామి! మాటలాడఁదొడంగినచో ముగియదు. నేను పోయెదను.

మహేంద్ర ——కల్యాణీ! ఏల యిట్లు చేసితివి? అని చెప్పి హో యని యేడ్చెను.

కళ్యాణి—— మృదుస్వరముతో, 'నేను మంచిపనినే చేసితిని. నాకొఱకై మీరు దేవ కార్యమునకు వెనుక దీయుచున్నారు. నేను దేవతా వాక్యము నుల్లంఘనము చేసినందున నాబిడ్డ పోయెను, ఇఁక మీరు అవహేళనము చేసినచో మీరును నామార్గముననే పోవుదురు.

మహేంద్ర—— ఏడ్చుచు, 'నిన్నెచ్చటనైనను విడిచి పెట్టి, కార్యసిద్ది యైనమీఁద, మరల నిన్ను పిలుచుకొనిపోయి సుఖపడ నెంచితిని, కల్యాణీ! నీవే నాసర్వస్వమై యుంటివి. ఏల యిట్లు చేసితివి? ఏ చేతితో కత్తి నెత్తి వేగముగా విసరుదునో యాచేయి పడిపోయినది. నీవు పోయినమీద నేనేల!' అనెను.

కల్యాణి—— 'ఎచ్చట నుంచెదరు? స్థల మెక్కడ! ఈకష్ట కాలమునందు తల్లిదండ్రులును బంధు బలగమును పోయిరి. ఎవరింట చోటున్నది? ఎచ్చటికి పోయియుండ నగును? నన్నెచ్చటికిఁ బిలిచికోని పోఁగలరు?. నేను తమకు గళ గ్రహు రాలుగ నున్న దానను. నేను గతించుటయే మంచిది; నాకు ఆశీర్వాదము చేయుఁడు. నే నాజ్యోతిర్మయమైన ప్రపంచమున కేఁగెద, మరల నా కచ్చోట తమదర్శనము లభించునట్లు ఆశీర్వదింపుఁడు' అని చెప్పి మరల నాతని పాద రేణువులను తలపై