ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండ్రెండవ ప్రకరణము

63


డలమునందు ప్రతిధ్వని నిచ్చెను. భృంగముల ఘీంకారముచే కాననము కంపిత మగుచుండెను. పక్షుల సుస్వరములచే నాకాశము ప్లావిత మయ్యెను. ఆనది పదతలమునందు మృదు కల్లోలధ్వని చేయుచు ప్రవహించుచుండెను. మంద మారుతమునస్య పుష్పసుగంధమును వీఁచుచుండెను. నడుమ నడుమ జలమునందు సూర్యప్రకాశము తళతళ లాడుచుండెను. తాళ పత్రములు మందపవనము చే మర్మర శజ్ఞము చేయుచుండెను, దూరమున నీలమైన పర్వతము చూడ్కి, కింపు పుట్టించుచుండెను, కొంచెము సేపు వీరిర్వురును ముగ్ధ భావముతో నిర్విణ్ణులై యుండిరి. కొంతవడికి కల్యాణి, మహేంద్రునిం జూచి మీరాలోచన చేయుచున్నట్లున్న' దనెను.

మహేంద్ర—— చేయవలసినదానిని ఆలోచించుచున్నాను. స్వప్నము కేవలము బిభీషికమాత్రము, అది మనస్సునందు పుట్టి యచ్చటనే గిట్టుచున్నది, జీవనము జలబుద్బుదము, లెమ్ము, పోదము.

కల్యాణి—— దేవత పొమ్మన్న చోటికి మీరు పొండు, అని చెప్పి బిడ్డను మగని చేతి కిచ్చెను.

మహేంద్ర——నీ వెక్కడికిఁ బోదువు ?

కల్యాణి —— చేతులతో కన్నులుమూసికొని దేవుఁ డెచ్చటికి రావలయు నని చెప్పినాఁడో అచ్చటికిఁ బోదును.

మహేంద్ర —— (విన్నఁబోయి), ఎచ్చటికీ ?

కల్యాణి —— విష వూరిత కరాటమును జూపెను.

మహేంద్ర—— ఏమి, విషమును పుచ్చుకొనెదవా?