ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

ఆనందమఠము


ప్రకాశ మూర్తి సుఖాసీనుఁడై యుండెను. శిరమున అగ్నిమయమైన కిరీటమును చతుర్భుజములును గల్గియుండెను. ఇరు ప్రక్కల యందును నిద్దఱు స్త్రీ మూర్తులుండిరి. ఆరూపము, ఆకాంతి, ఆసౌరభము చెప్పనలవి కాదు. దానిని జూచిన మీఁద వచ్చుటకు మనసొప్పదు, ఆచతుర్భుజమూర్తి ముందుభాగమునందు మఱోక స్త్రీ మూర్తి కలదు. దానిని: జూచుటకు సాధ్యము కాలేదు. జ్యోతిర్మయిగా నుండెను. అయినను, నాలుగుదిశ లందును మేఘాచ్ఛన్నమై యుండెను చక్కఁగా గనఁబడ లేదు. ఆబింబము సుందరముగ నుండినప్పటికిని శీర్ణమై యేడ్చుచున్నట్లు తోఁ చెరు. నే నాసుగంధ మందపవనతరంగములచేఁ గొట్టఁబడినదాననై మెల్ల మెల్లగాఁ జతుర్బుజమూ ర్తిసింహాసనము చేరువ చేరితిని. అచ్చట నా మేఘమడిత శీర్ణ మూర్తి నన్నుఁ జూపుచు ఈ స్త్రీ యే యది దీనికొఱకే మహేంద్రుఁడు నాతొడపై వచ్చి కూర్చుండ లేదనెను. అపుడు మధురమైన వేణు నాదము వినఁబడెను. ఆ చతుర్భుజమూర్తీ నన్నుఁజూచి, 'నీపతిని విడిచి పెట్టి నాయొద్దకు రమ్ము ఈమెయే నీతల్లి, నీ స్వామిసమిపమునం దున్న యెడల ఈ దేవి సేవ కలుగదు, నీవు వచ్చి చేరు' మనెను. నేను ఏడ్చుచు 'నాస్వామిని విడిచి పెట్టి యెట్టువత్తు' నని యడిగితిని. ఆ వేణు స్వరములోనే 'నేనే స్వామి నేనే తల్లి, నేనే తండ్రి, నేనే బిడ్డ, నా చెంతకు రమ్ము' అని వినఁ బడెను. "నేనేమి బదులు చెప్పితినో యది నాకు జ్ఞప్తి లేదు కొంత సేపటికి మేల్కాంచితి”నని చెప్పి, కల్యాణియూరకుండెను.

మహేంద్రుఁడు విస్మితుఁడై భీతిల్లినాఁడు; వాని నోట నుండి మాటయే రాలేదు. తలమీఁదుగ కోకిలపక్షి దిజ్ముం