ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండ్రెండవ ప్రకరణము

61


దొక వృక్షమూలంబునం గూర్చుండి, తన నాథుని సమీపమునం గూర్చుండునట్లు చెప్పెను. మహేంద్రుఁడు కూర్చుండెను. తర్వాత వానియొద్దనున్న బిడ్డను దీసికొని, మగని చేయిఁబట్టుకొని, 'నేఁడు మీముఖము వాడి యున్నది, మనము విపత్తునుండి తప్పించుకొని వచ్చితిమికదా, ఇఁక నేల విషాదము?' అనెను.

మహేంద్ర——నిట్టూర్పుపుచ్చుచు, ఇఁక నేను నీ వాఁడను కాను, నే నేమి చేయవలయునో తెలియలేదు.

కల్యాణీ——ఏల?

మహేంద్ర—— నిన్ను విడనాడినది మొదలు చాల సంకటములకు లోనైతిని, దాని నంతయుఁ జెప్పెద వినుమని సర్వమును జెప్పెను.

కల్యాణీ, “నాకును అనేక కష్టములు సంభవించెను. అనేకములైన ఆపదలకు లోనై తిని. ఇప్పుడు దానినంతయు విని నీవు చేయున దేమున్నది? అతికష్ట దశ యందుఁగూడ నిద్దురవచ్చెను. నిద్రావస్థయం దొక కలగంటిని. ఏమిపుణ్యబలముచే నట్టి కలవచ్చెనో తెలియదు. స్వప్నమునం దొక అపూర్వస్థలమునకు నేనుబోయితిని. అచ్చట భూమీ లేదు. ఉత్త వెల్తురు. అది అతిరమణీయమైన వెలుతురు. అచ్చట మనుష్యులు లేరు. అందఱును జ్యోతిర్మయ మూర్తులు, ఆచోట శబ్దమే లేదు. ఎచ్చటనో దూరముగా మధురమైన గీతవాద్యశబ్దము వినవచ్చెను, అక్కడ అపుడు వికసించిన మల్లికామాలతీ సుగంధ రాజాది పుష్పముల సుగంధము సదా వీచుచుండెను. అచ్చట ఉన్న తాసనమునందు అందఱకును దర్శనీయ మగునట్లు మహా