ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

ఆనందమఠము


యెడల, ఈమఠమునకు వచ్చుటకును, బైటపోవుటకును ఎవరికిని సాధ్యము కాదు.

మహేంద్ర—— నీవు సంతానుఁడవా!

వైష్ణవ——అవును, నేను సంతానుఁడను. నాతోఁగూడ రా; నీకు దారిచూపెద. నీకొఱకే నేనిచటికి వచ్చినాను.

మహేంద్ర —— నీ పేరేమి?

వైష్ణవ——నా పేరు ధీరానంద గోస్వామి. అని చెప్పి, ముందుగా నడిచెను. మహేంద్రుఁడును గల్యాణియు వాని వెనుకఁ బోవుచుండిరి. ధీరానందుఁడు అతిదుర్గమమైన మార్గముగాఁ బిలిచికొనిపోయి బైటవిడిచి పెట్టి, యతఁడు అడవి లోనికి. బ్రవేశించెను.

ఆనందారణ్యమునం దుండి వారి బైటికి వచ్చిరి; కొంత దూరమున వృక్షములచే నలంకరింపఁబడినట్టి యొక ప్రాంతం మారంభమాయెను. ఆ ప్రాంతము నంటియే రాజమార్గము. మణికొంచెము దూరమునందు అరణ్యమునందుండి కలకల మను శబ్దముతో నొక చిన్న యేఱు పాఱుచుండెను. జలము నిర్మలమై నిబిడ మేఘమువలె నీలవర్ణముగా నుండెను. నదీతీరము లందు శ్యామలశోభామయములైన నానాజాతీయ వృక్షములు నీటికి నీడనిచ్చునట్లు వాలియుండెను ఆవృక్షతతులందు నానావిధ పక్షులు నానావిధధ్వనులు చేయుచుండెను. ఆకలకలధ్వని కర్ణానందముగను, మనోహరముగ నుండెను. ఆధ్వని నదీ ప్రవాహ శబ్దముతో మిళితమైవినఁబడుచుండెను. అట్లే వృక్షచ్ఛాయయు జలవర్ణముతోఁ జేరిపోవు చుండెను. కల్యాణి మనస్సు ఆఛాయతోఁ జేరినట్లు కనఁబడుచున్నది. కల్యాణి నదీతీరమునం