ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండ్రెండవ ప్రకరణము

59


మును ఆపార్థివమును పవిత్రమునైన మాతృసేవావ్రతదీక్షను గయికొనవలయునని యాలోచించికొని యుండెను. కాఁబట్టి, వాఁడు కల్యాణి చెప్పినదానికి సమ్మతించెను. అనంతర మిర్వురును ఆయాసమును పరిహరించుకొని బిడ్డ నెత్తుకొని పదచిహ్న గ్రామాభిముఖులై బయలు దేరిరి.

పదచిహ్న గ్రామమున కేమార్గముగాఁ గాఁబోవలయునోయది తెలియదు. ఆదుర్భేద్యమైన యరణ్య మధ్యమునందు కొంచెమైనను మార్గమును దిక్కును గోచరించ లేదు. వారు అరణ్యమును దాటిపోయిన మీఁదఁ దెలియఁగలదని తలంచి యుండిరి. ఆయరణ్యమునుండి బైటపోవుటకు దారి కనఁబడ లేదు. అటుఇటుపోయిచూచిరి గాని, తుదకు ఆమఠము చెంతకే రావలసినట్లేర్పడెను. బైటపోవుటకు దారియే కనఁబడ లేదు. అక్కడ, వీరిముందుగా నొక అపరిచితుఁ డైన వైష్ణవ వేషధారి యైన బ్రహ్మచారి నవ్వుచు నిలిచియుండెను. వానింజూచి మహేంద్రుఁడు కోపముతో ‘ఏలనవ్వెద' వనెను.

వైష్ణవసన్యాసి——మీరీయడవి కెట్లు వచ్చితిరి?

మహేంద్ర ——ఎట్లయిన నేమి, వచ్చి చేరితిమి.

వైష్ణవ——వచ్చి చేరితిరికదా! ఏల బైటపోవుటకు తెలియలేదు? అని చెప్పి మఱల నవ్వెను.

మహేంద్ర —— కోపముతో, నవ్వుటచే నేమి ప్రయోజనము, నీవుమాత్రము పోఁగలవా? యనెను.

వైష్ణవ—— నాతోఁగూడ వచ్చినచో మార్గము నగపఱతును; నీవు ఇచ్చటికి సన్న్యాసి వెంబడి వచ్చియుండువు, లేని