ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

ఆనందమఠము


తుడిచికొనిరి. ఆయినను, కన్నీరు మున్నీరుగాఁ బ్రవహించుచునే యుండెను. కొంత సేపటికి తమకుఁ దామే శాంతి నొందిరి. కల్యాణి, భోజన ప్రస్తావము చేసెను. బ్రహ్మచారి యనుచరుండొకఁడు భక్షముల నొకతట్టయందిడి తెచ్చెను. దానింగైకొనుమని కల్యాణి భర్తతోఁ జెప్పెను. దుర్భిక్ష కాలము కనుక అన్న వ్యంజనాదులు దొరకుట లేదు.అయినను సంతానులకు మాత్రము దొరకుచుండెను. లేని వస్తువు లెవరికిని దొరకవు. ఆయరణ్యము సాధారణజనులకు అగమ్య మైనది. ఏ చెట్టునండేకాయ కాచినను ఎప్పుడు పండినను అన్నమునకు లేనివారు దానిని గోసి తినివేయుదురు. ఈయడవిచెట్లలోని కాయలును 'పండ్లును ఇతరులకు లభ్యము కావు. బ్రహచారి కొన్ని దినుసుల పండ్లును కొంచెము పాలును తెచ్చియిచ్చి వెడలిపోయెను. సంతానులకు పాడియావులు చాలాకలవు కల్యాణి పలువిధములుగా వేఁడుకొన్నందుమీఁద మహేంద్రుడు కొన్ని పండ్లను దినెను. భుక్తావశేషమును గల్యాణి వేఱోక ప్రదేశమునందుకూరుచుండి భుజించేను. అనంతర మిరువురును నిద్రించి శ్రమమును పరిహారము చేసికొనిరి. మేల్కొన్న తర్వాత ఇర్వురుసు ఎచ్చటికిఁ బోవలయునో దానిని గూర్చి యాలోచించిరి. 'కల్యాణి, మనము గృహమునం దున్న యెడల విపత్తు కల్గునని యెంచి గృహత్యాగము సేసివచ్చితిమి, ఇపుడు చూడఁగా ఇంటికంటే బైటనే విపత్తు లధికముగా నున్నవి. మఱల ఇంటికే పోదము' అనెను. మహేంద్రునికిని అదే యభిప్రాయముండెను. వాఁడు కల్యాణిని ఇంటియం దుంచి సంరక్షించుటకుఁ దగిన మనుష్యులను నియమించి, పరమరమణీయ