ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

ఆనందమఠము


బ్రహ్మచారి —— చెప్పి రావలసిన దేల?

మహేంద్ర —— నేనును ఈమహా వ్రతమును గ్రహణము చేయుదును.

బ్రహ్మచారి—— వారిని ఎచ్చటికి పంపగలవు ?

మహేంద్రుఁడు కొంచె మాలోచించి, నాయింటియం దెవరును లేరు. నాకు వేఱే చోటేమియు లేదు. ఈ అనాయక సమయమునం దెచ్చట స్థలము దొరకును?

బ్రహ్మచారి—— మనము వచ్చిన మార్గమున నే వెనుకకుఁ దిరిగి పోయితి మేని యచ్చటనుండు మందిరమున నీ భార్యయు బిడ్డయు నుందురు. కల్యాణి, ఇంకను ఉపవాసము, వారుండు చోటనే భక్ష్య సామగ్రులు సిద్ధమై యున్నవి. వారిని భుజింపజేసి నీయిష్ట ప్రకారమే మేని చేయుము, నేను పోయెదను. నీ మనస్సారీతిగ నుండెనేని ఉపయుక్తసమయమునందు నిన్ను చూడఁగలను. అని చెప్పి బ్రహచారి యేదో యొక రహస్యమార్గముగా వెడలిపోయెను. మహేంద్రుడు తాను పోయిన మార్గమున నే వెనుకకు దిరిగివచ్చి చూడఁగా నచ్చటి మందిర ద్వారమునందు కల్యాణి కొమార్తెను తొడపై నిడికొని కూర్చుండి యుండెను.

సత్యానందుఁడు వేఱోకసొగంగమున దిగి భూగర్భస్థమైన మఱోకమందిరమునకుఁ బోయెను. అచ్చట జీవానందుఁడును భవానందుఁడును గూర్చుండి రూపాయలను లెక్కఁ పెట్టి కుప్పలుకుప్పలుగా నుంచుచుండిరి. ఆమందిరమునందు స్తూపాకారముగా బంగారు వెండి తామ్ర, నాణెములును, వజ్ర వైడూర్య ప్రవాళ ముక్తాది నవరత్నములును రాసులు రాసులుగా నుం