ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

ఆనందమఠము


మహేంద్ర——భయముతో, కాళి, యిట్లేల యైనదో?

బ్రహ్మచారి—— 'అంధకార సమాచ్ఛన్నమైన కాలిమామయి యైన మహాకాళి, అపహృతసర్వస్వయై నగ్నయై యున్నది. ఇపుడు దేశమంతయు శ్మశానమై పోయినది. కావున, మహామాత కంకాళమాలినియై యున్నది. తనమంగళమును తన పదతలంబున మెట్టుకొని యున్నది ' అని చెప్పుచు కన్నీ రొలుకుచు 'హా తల్లీ!' యనెను.

మహేంద్రుఁడు—— ఈమె చేతియందు ఖేటకర్పరము లేల?

బ్రహచారి —— మేము సంతానులము, వీనిని మాతల్లికి ఆయుధములుగా నిచ్చి యున్నారము. చెప్పుము, “వందేమాతరం.”

మహేంద్రుడు “వం దేమాతరం” అని చెప్పి కాళికి నమస్కరించెను". అనంతరము బ్రహచారి, 'ఈమార్గముగా రమ్ము. 'అని చెప్పి రెండవసొరంగమునకు పోయెను. మహేంద్రుఁడును పోవుచుండెను. పోవునపుడు వా రిర్వురిమీఁదను ప్రాతస్సూర్యకిరణ రాశి సోఁకెను. నలుదిశలయందును పక్షులు కలకల మనికూయుచుండెను. అచ్చట మర్మర ప్రస్తర నిర్మితమైన ప్రశస్తమందిరమునందు సువర్ణ నిర్మితమైన దశభుజవిగ్రహము, ఆనవారుణకిరణమునందు జ్యోతిర్మయమై మందహాసముఖియై ప్రకాశించుచుండెను, బ్రహచారి ప్రణామము చేసి, ఈమెయే తల్లి. ముందెట్లు కావలయునో ఆస్వరూపమును దెలియఁ జేయు చున్నది. దశభుజములు దశదిశలయందు ప్రసారితమై యున్నవి. ఆదశభుజములయందు నానావిధశక్తులు ఆయుధస్వరూపములుగా శోభిల్లుచున్నవి. శత్రువిమర్దితపదయుగళంబును