ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

ఆనందమఠము


భవానంద —— అట్లయిన రమ్ము, నీ భార్యను కొమార్తెను జూపెదను. ఇట్లు చెప్పి భవానందుఁడు ముందు నడిచెను, మహేంద్రుడు వానిని వెంబడించి చనెను. భవానందుఁడు మరల "వందేమాతరం” అను గీతమును పాడుటకుఁ దొడంగెను. మహేంద్రుని కంఠ స్వరమును శ్రావ్యమైనది. వాఁడును పాడుట కారంభించెను. ఇట్లు పాడుచున్న మహేంద్రుఁడును బాష్పపూరిత లోచనుం డయ్యెను. అంత వాఁడు భవానందుని జూచి, 'భార్యను బిడ్డను ద్యజింపకుండుటకు సాధ్య మగునెడల, మీవ్రతమును నాకును దెల్పుఁ డనెను

భవానంద —— ఈ వ్రతము నవలంబించువారు భార్యను బిడ్డలను ద్యజింపవలయును. నీవు ఈవ్రతము నవలంబించితివేని పెండ్లామును బిడ్డను జూడఁగూడదు. వారు సుఖముగా నుండుటకుం దగిన పద్ధతులు చేయఁబడును. ఈ వ్రతము సమాప్తియైన మీఁద భార్యను బిడ్డను జూచుటకు ఆటంకము లేదు.

మహేంద్ర——అట్లయిన యెడల నే నీ వ్రతము నాచరింపను; నాకుఁ దెల్పవలదు.


పదునొకండవ ప్రకరణము

మహేంద్రుఁడు భార్యను బిడ్డను గాంచుట.

రాత్రి గడచెచు. ఉదయ మయ్యెను. నిర్జనారణ్యము. ఇదివఱకు అంధకారముగను నిశ్శబ్దముగను ఉండెను. ఇప్పుడు