ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

49


సరిగా వచ్చుట లేదు. సిపాయీలకు నెలజీతము సరిగా ముట్టుట లేదు కడపటిమాట, సాహసము పిరంగిగుండు, ఒక్కస్థలమున నేగానీ పది చోట్లలో పడుట లేదు. కాఁబట్టి ఒక గుండును జూచి పదుగురు పరుగిడవలసిన పని లేదు. అయినను, ఒకగుండును జూచినయెడల తుకక లందఱును పరుగిడెదరు. గుంపులో గుండుపడినా ఇంగ్లీషువారు పాఱిపోవుట లేదు,

మహేంద్ర——అట్లయిన మీకీగుణములన్ని యుఁగలవా?

భవానంద —— లేదు.గుణములు పండ్లవలె చెట్లలోనుండి రాలుట లేదు. అభ్యాసము చేసినచో వచ్చును.

మహేంద్ర —— మీరు అభ్యాసము చేయుచున్నారా యేమి?

భవానంద——కనఁబడ లేదా మేము సన్న్యాసులనునది? మాసన్న్యాస మంతయు నీయభ్యాసముకొఱకే. కార్యసాధనమైన (అభ్యాసము సంపూర్ణమైన) యెడల, మేము మరల గృహస్థుల మగుదుము. నాకును ఆలు బిడ్డలు కలరు.

మహేంద్ర——మీసంతాన మంతయు జనులను వంచించుటకే కదా !

భవానంద ——సంతానులు అబద్ధము చెప్పుట లేదు. నీ యొద్ద బొంకి మెప్పొందవలసినంత గ్రహచార మేమియు లేదు. వంచించువా రెవరు? వంచన యనునది మాయొద్ద దొరకదు. అది మొదటనుండియు లేదు. మేము మాత్రము నెఱవేర్చువారము. నీవును సంతానుఁడ వయ్యెదవా !

మహేంద్ర — నేను నా పెండ్లామును బిడ్డను చూడకయే యేదియుఁ జెప్పను.