ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

ఆనందమఠము


భవానంద —— ఇపుడు నీవు ఇన్నూర్గురుజనులను చూడ లేదా?

మహేంద్ర——ఆందఱును సంతానులా (సన్న్యాసులా!)

భవానంద——ఔను, అందఱును సంతానులే,

మహేంద్ర —— ఇం కెంద ఱున్నారు?

భవానంద —— ఇట్టివారు వేలకొలఁదిజను లున్నారు, ఇంకను కాఁదగినవారు నున్నారు.

మహేంద్ర——పది ఇరువది వేల జనులు చేరుదురా! అయినంతమాత్రమున తురకలను రాజ్యపద భ్రష్టులనుగాఁ జేయుటకు సాధ్యమా?

భవానంద—— పలాశి {Plassy) యుద్ధమునందు ఇంగ్లీషువారి కెంత సైన్యముండెను?

మహేంద్ర——ఇంగ్లీషువారు బంగాళీలా యేమి?

భవానంద——ఆయిన నేమి? శరీకబల మధికముగ నున్న చాలదా ? గుండేమి చేయును, అది యెంతమాత్రము ?

మహేంద్ర——అయినను ఇంగ్లీషు వారికిని తురకలకును ఇంత వ్యత్యాసమేమి?

భవానంద —— మొదటిది, ఇంగ్లీషువారిలో నొకఁడు చచ్చిపోయినయెడల అందఱును పరుగెత్తిపోవుట లేదు; ముసల్మానులమీఁద ఒక దెబ్బ పడినచో నందఱును పలాయనపరులగుచున్నారు; షర్బత్తును వెదకుచు పోయెదరు. రెండవది, ఇంగ్లీషు వారికి పట్టుదల కలదు; పట్టినపట్టు విడువరు; సాధించేదరు. ముసల్తానులు దీనికి వ్యతిరేకము; వేతనాపేక్ష కలవారు; ధనమునకై ప్రాణమును విడిచి పెట్టువారు; అదియు