ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39

తొమ్మిదవ ప్రకరణము


కత్తిని పాఱవేసి యచ్చోటనుండి మెల్ల మెల్లగ పోవుచుండెను. అపుడు భవానందుఁడు వచ్చి దాని ప్రక్కనునిల్చెను.

మహేంద్ర—మీరెవరండి !

భవానంద —— నే నెవరైన మీకేమి?

మహేంద్ర —— అందువలన నాకు కొంచెము పనియున్నది; ఈదినము మీవలన మహోపకారమును బొందితిని.

భవానంద—— అట్టి ఉపకారము నావలనఁ గలిగినదని మీరు నమ్మినట్లు నాకు తోఁప లేదు. మీ చేత ఖడ్గ ముండియు దూరముగ నిలిచియుంటిరి, జమీందారుల కుమారులు పాలు పెరుగు వెన్న నెయ్యి లడ్డు బూంది మొదలైనవానిని గొంతు వఱకు తినుటకును, ఇష్టానుసారముగా ధనమును దుర్వినియోగము చేయుటకును సమర్థతగలవారేకాని సమయము వచ్చినపుడు ఎందులకును పనికి రారు.

మహేంద్ర——భవానందునీమాట ముగియునంతలోపల వేసటనొంది, 'ఈపని మంచిపనికాదు, ఇది దొంగపని' యనెను.

భవానంద—— దొంగపని యైనను చింత లేదు. నావలన, మీరు ఉపకృతు లైతిరి. ఇంకను ఉపకారమును పొందవలసిన వారై యున్నారు, నే నింకను ఉపకారము చేయవలయునని యున్నాను అనెను.

మహేంద్ర——మీరు నాకుపతార మొనర్చినది నిజము, ఇంక నేమియుపకారము చేయఁబోయెదరు? దొంగలచేతనుండి తప్పించితిరి. నేను తమకు ప్రత్యుపకారము నేమియు చేయుటకును శక్తుఁడను కాను.