ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

ఆనందమఠము


మహేంద్రుఁడు, విస్మీతుఁడై బదులేమియుఁ జెప్పక భవానందుఁడు చెప్పినట్లు చేసెను. చేతికి కట్టినదారము తెగిపోయెను. ఆమీఁద భవానందుఁడు 'కాలిని యుంచు' మనెను. మహేంద్రసింహుఁ డాలాగే యుంచెను. కాలికట్టును తెగిపోయెను. తర్వాత భవానందుని ఆజ్ఞాప్రకారము మహేంద్రసింహుఁడు నిశ్చేష్టితుఁడై కూర్చుండియుండెను, భవానందుఁడును నిస్తబ్ధుఁడై యుండెను.

బ్రహచారి నిలిచి చూచుచున్న కొండ ప్రక్కననుండు మార్గము మీఁదుగానే యీసిపాయీలును బోవుచుండిరి. సిపాయీలు ఆకొండను సమీపించిరి. అచ్చట సున్న యొక బండి పై యొకమనిషి నిలువంబడి యుండెను; చంద్ర కిరణ ప్రకాశము చే వానీ నల్లనిదేహము కనఁబడెను. వెంటనే సిపాయీల హవల్దారు, 'అదిగో! మఱోక దొంగ యున్నాఁడు, వానిని పట్టుకోని రండు, మూట మోయించవచ్చు ' ననెను. సిపాయీలలో నొకఁడు వానిని పట్టి తెచ్చుటకుపోయెను. అయినను ఆమనిషి కదలక యట్లే నిలిచియుండెను. సిపాయి పోయి వానిని పట్టుకోనెను. వాఁడేమియు నన లేదు. పట్టి తెచ్చి హవల్దారుముందు నిల్పెను, హవల్దారు 'వీనితలపై మూటను పెట్టుఁ' డనెను. అట్లే వాఁడు మూటను తలపై నుంచెను. వాఁడు మూటను మోసికొని ముందు నడిచెను. హవల్దారు ఒక బండి వెనుక నడచిపోవుచుండెనుఁ పోవునపుడే హఠాత్తుగా తుపాకిశబ్ధము వినఁబడెను, ఆగుండు హవల్ దారు తలకు తగిలెను, వాఁడు నేలమీఁద బడి గిజగిజ తన్నుకొని చచ్చెను. తర్వాత ఒక సిపాయి ఈమూట మోసికొనిపోవు దొంగవిధవకొడుకు