ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిదవ ప్రకరణము

35


నెట్టుకొని వచ్చెను. భవానందుని కన్ను లెఱ్ఱనై జ్వలించు చుండెను. అయినను, వినీత భావముతో, 'అయ్యా! ఏమి చేయవలయును, చెప్పండి!' అనెను.

సిపాయి భవానందుని సమ్రతకు మెచ్చి 'ఈమూటను మోచికొనీరా దొంగభడవా' అనెను. వేఱోక సిపాయివచ్చి “వద్దు, ముల్లె పోవును, వీఁడు దోంగ, పరుగెత్తిపోవును, పట్టే వారెవరు? ఇదివఱ కొక దొంగకొడుకును బండిలో కట్టి వేసినాము, ఆలాగే వీనినికూడ కట్టి బండిమీద వేయండి” యనెను భవానందునకు, బండిమీఁద నున్న వానిని కనుఁగొనవలయు ననెడి కోరిక యుండుట చేత, తటాలున తలపై నున్న మూటను క్రిందపడవైచి, సిపాయిని బలమైన గుద్దు గుద్దెను. అందుచేత సిపాయీలు కోపముతో భవానందుని కట్టి బండిలో పడవేసిరి. భవానందునికి తనకంటే ముందుగా బంధింపఁబడి బండిలో పడియుండువాఁడు మహేంద్ర సింహు: డని తెలిసినది.

సిపాయీలు అన్యమనస్కులై కోలాహలములతో ముందుగాఁ బోవు చుండిరి. ఆయెద్దులబండి కటకట, గడగడ కచ్కచ్, కింయ్ కింయ్ ఆనుశబ్ధము చేయుచు పోవుచుండెను అపుడు భవానందుఁడు మెల్లగా —— " మహేంద్ర సింహా! నిన్ను నాకుఁ దెలియును; నీకోఱకే నేను వచ్చితిని. నే నెవరనునది నీవు తెలిసి కొనవలసిన పని లేదు. నేను చెప్పునట్లు నీవు చేయుము. నీ చేతిని బండిచక్రముపై నుంచుము, ఆచక్ర ఘర్షణముచే చేతికి కటియుండు దారము తెగిపోవును” అనెను.